Railway Bridge Collapse: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెల్లో రివర్ (హువాంగ్ హీ)పై నిర్మాణంలో ఉన్న ఓ భారీ రైల్వే వంతెన ఆకస్మికంగా కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 12 మంది కార్మికులు మృత్యువాత పడగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
వంతెన నిర్మాణంలో సుమారు 40 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా వంతెన మద్యభాగం కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న వారు నది నీటిలో పడిపోయారు. కొంతమంది భారీ ఐరన్ గర్డర్లు, కాంక్రీట్ బ్లాకుల కింద చిక్కుకుపోయారని రెస్క్యూ బృందాలు తెలిపాయి.
పోలీసులు, రెస్క్యూ టీములు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో పడిపోయిన వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ఈ వంతెన చైనా ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. హువాంగ్ హీ రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద నిర్మాణంలో ఉంది. సుమారు 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్, రెండు ముఖ్యమైన రైల్వే మార్గాలను అనుసంధానించాల్సి ఉంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,800 కోట్లకు పైగా ఉండగా, వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి చేయాలనే ప్రణాళిక ఉంది.
అయితే, ఈ ప్రమాదంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనేక అనుమానిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి కారణంగా భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో.. కాంక్రీట్ మిక్స్‌లో లోపాలు, ఇంజనీరింగ్ లోపాలు, డిజైన్ కారణంగా వంతెన స్తంభాలు బలహీనపడ్డాయని అధికారులు అనుమానిస్తున్నారు. అదనంగా, గత వారం ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ఇంజనీర్లు పేర్కొన్నారు.
Also Read: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
మరికొందరు ఈ సంఘటనను మానవ తప్పిదంగా కూడా అభివర్ణిస్తున్నారు. వంతెన మధ్యభాగంలో సిమెంట్ కాంక్రీట్ సెట్ అవకముందే అదనపు బరువును పెట్టడం వలన గర్డర్లు బలహీనపడి ఉండవచ్చని వారు అంటున్నారు.