E-Paper
Advertisement

Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

1. ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో.. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు.

2. వెంకన్న సేవలో ప్రముఖ మంత్రులు

తిరుముల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేకం సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రి కె షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతిరావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పట్టువస్త్రాలుతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

3. దొంగల బీభత్సం..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్‌లోని విజ్ఞేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవాలయ గేట్ల తాళాలు ఇనప రాడ్లతో పగలగొట్టి హుండీలోని సుమారు 30వేల నగదును ఎత్తుకెళ్లినట్లు దేవస్థాన ఛైర్మన్ తెలిపారు. సీసీ ఫుటేజీలో హుండీ పగలగొట్టే దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఛైర్మన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

4. పాపం.. ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి..

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ముదిరాజ్ కాలనీలో 5 ఏళ్ల బాలుడు వీరవేణి విష్ణువర్ధన్‌పై వీధి కుక్క దాడి చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేయడంతో కాళ్లకు గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బాలుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వీధి కుక్కలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

5. విశాఖ చేరుకున్న రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..

విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్టన్‌కు విశాఖ ఐఎన్ఎస్ డేగాలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

6. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి!

జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాల వేళ విషాదం చోటుచేసుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ అన్వర్ గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర విషాదం మునిగిపోయారు.

7. అనిల్ కుమార్ కేసులో చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశం..

కృష్ణా జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కేసులో.. చర్యలు తీసుకోవద్దంటూ పమిడిముక్కల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జగన్ పర్యటనలో దురుసుగా ప్రవర్తించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రెండు వారాలు వాయిదా వేసింది.

8. పెరుగుతున్న చలి.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

అల్లూరి జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. పాడేరులో 10.9, చింతపల్లిలో 10.5 డిగ్రీలుగా నమోదు అయింది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

9. ఎస్బీఐ బ్యాంకులో నగదు అవకతవకలపై 5గురు నిందితులకు రిమాండ్‌

నారాయణపేట జిల్లా ఉట్కూర్ ఎస్బీఐ బ్యాంకులో నగదు అవకతవకలపై ఐదుగురు నిందితులకు రిమాండ్‌ విధించినట్లు సీఐ రామ్ లాల్ తెలిపారు. 2016 నుంచి 2019 వరకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి 414 ఖాతాలలో 3.91 కోట్ల రూపాయల అవకతవకలు రావడంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ మోసంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నట్లు సీఐ చెప్పారు.

10. వ్యభిచార గ‌ృహాలపై పోలీసుల దాడులు..

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవులూరు గ్రామంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో మంగళగిరి, పలు ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

11. పెద్దారెడ్డిపై కేసు నమోదు..

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరగడంతో, ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు.

12. తాగిన మైకంలో గొడవ..

నారాయణపేట జిల్లా మల్లేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రామ్ లక్ష్మణ్ గ్రామ దేవత పండుగ భోజనాలకు నరేందర్, చంద్రశేఖర్‌లను పిలిచాడు. పండుగలో మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భోజనం తర్వాత తిరిగి వెళ్తున్న నరేందర్‌ను చంద్రశేఖర్ ఆపడంతో మాటలు పెరిగి.. బొలెరోతో ఎక్కించేసి తీవ్రంగా గాయపరిచాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

13. రామప్ప అభివృద్ధిపై మందుకు అడుగులు..

రామప్ప అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రసాద్‌ పథకం ద్వారా 62 కోట్లతో చేపట్టిన ఇంటర్‌ ప్రిటీషన్‌ సెంటర్‌ పనులు కొనసాగుతుండగా.. తాజాగా సాస్కీ పథకం ద్వారా ఇక్కడి సరస్సులోని దీవి సుందరీకరణకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం 13 కోట్లు కేటాయించడంతో క్షేత్రా కన్సల్టెంట్‌ అనే ప్రైవేట్ సంస్థ టెండర్‌ దక్కించుకొంది.

14. కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ

నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి వెంకటేష్, రాణా, నిర్మాత సురేష్, అభిరామ్ నేడు హాజరు కానున్నారు. దక్కేన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై నందకుమార్ కోర్టును ఆశ్రియించారు. 2022 వంబర్, జనవరిలో దక్కేన్ హోటెక్ కూల్చివేయడంతో తన హోటల్‌ని కూల్చివేశారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో 20 నెలలుగా విచారణ కొనసాగుతుంది. నేడు వ్యక్తిగతంగా దగ్గుబాటి ఫ్యామిలీ బండ్లు సమర్పించనున్నారు.

15. ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. స్పాట్‌లో ఐదుగురు..

మహబూబాబాద్ జిల్లా శనిగాపురం శివారు కుమ్మరికుంట్ల తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారు నేరేడ KGBV టీచర్లుగా గుర్తించారు. క్షతగాత్రులని 108 ద్వారా మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

16. ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్..

ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో బైకుని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు చోదకుడు మిక్కిలి సమీర్ స్పాట్‌లోనే మృతి చెందాడు. జి.కొండూరు మండలం కండ్రిక గ్రామానికి చెందిన సమీర్ పెయింటింగ్ పనికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

17. విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

ఇండిగో, బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు.. ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ఇటు బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోని ఐసోలేషన్ సెంటర్‌కి తరలించి బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

18. మరోసారి నాసా ప్రయోగం విజయవంతం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్‌ మిషన్‌ ఎస్కపేడ్‌ ప్రయోగం విజయవంతమైంది. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆర్జిన్‌‌కు చెందిన జంబో రాకెట్‌ అంతరిక్ష నౌకను నింగిలో ప్రవేశపెట్టింది. అనంతరం సదరు రాకెట్‌ విజయవంతంగా భూమిని చేరింది.

19. మరోసారి వేదికపై మెరిసిప జ్యోతి సురేఖ

ప్రపంచ రెండో ర్యాంకర్‌ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏపీకి చెందిన ఈ ఆణిముత్యం రెండు స్వర్ణ పతకాలతో అదరగొట్టింది. ముందుగా దీప్షిక, ప్రీతికలతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలోనూ బంగారు పతకాన్ని సాధించింది.

20. శివ రీరిలీజ్‌.. నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ చిట్‌చాట్‌

తమ కాంబోలో 36 ఏళ్ల క్రితం వచ్చిన శివ రీరిలీజ్‌ కానున్న నేపథ్యంలో హీరో నాగార్జున, డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. సినిమా సైలెంట్‌గా ఉందని, నటులంతా నెమ్మదిగా మాట్లాడుతున్నారని మూవీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని దర్శకుడు నాగార్జునతో చెప్పారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×