SSMB29: దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసిన అది పాన్ ఇండియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. తెలుగు డైరెక్టర్లలో టాప్ లిస్టులో ఈయన పేరే మొదటగా వినిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల రాజమౌళి తెర్కెక్కించిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తున్నాయి.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. SSMB29 పేరుతో ఆ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఈ చిత్రం కాపీ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే..
రాజమౌళి సినిమాల స్టోరీలు కొత్త ఉంటాయి. మిగితా డైరెక్టర్స్ తో పోలిస్తే ఈయన సినిమాలకు ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువే. RRR తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ 29 వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ ‘గ్లోబ్ ట్రాటర్’ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ పాటను హీరోయిన్ శృతి హాసన్ తన వాయిస్ తో పాడటంతో క్రేజ్ పెరిగింది. లిరికల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ, ఇప్పుడు ఈ పాటకు కాపీ రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఇది హాలీవుడ్ కు చెందిన 2 డబ్ల్యూఈఐ & ఏడ్డా హయష్ అనే ఫెమస్ ఆల్బమ్ పాటకు దగ్గరగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్ కూడా కాపీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. మరోసారి పాట కాపీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై జక్కన్న, లేదా కీరవాణి స్పందిస్తారేమో చూడాలి..
Also Read : ‘అగ్నిసాక్షి’ గౌరీ జీవితమంతా కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీ కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఈ మధ్య సినిమా నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్ నవంబర్ 15 న రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుంది. ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కి విక్రయించి సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఢిల్లీలో బాంబ్ పేలుళ్ల ఘటన కారణంగా ఈ ఈవెంట్ కు కఠిన నిబంధనలతో జరగనుందని టాక్..శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.. ఇప్పటికే వీళ్ల పోస్టర్స్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. త్వరలోనే మహేష్ పోస్టర్ రిలీజ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్…