వైజాగ్ సీఐఐ సదస్సు విజయవంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడ్డులకు పెద్ద పీట వేస్తుందన్నారు శివనాథ్.
సౌదీలో బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్. ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక్కడి నుంచి సౌదీకి ఫ్లైట్‌ను పంపామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే.
CII భాగస్వామ్య సదస్సును దోషరహితంగా నిర్వహించినందుకు, పెట్టుబడి ఊపును పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు ఛాంపియన్‌లకు పెద్ద అభినందనలు. వీసాలు, రోడ్‌షోలు, మార్కెట్ ఇంటెల్‌తో సహా అన్ని అంశాలలో వారి ప్రతిభ, పట్టుదల ప్రమాణాలను నిర్దేశించాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బైక్‌పై వెళ్తున్న 18 ఏళ్ల కళ్లెం శ్రీనివాస్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్‌లో సోదాలు నిర్వహించి, హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మంది అనుమానితులను విచారిస్తున్నారు. ఎర్రకోట చుట్టూ రెక్కీ ప్రాంతాల్లోనూ భద్రతను పటిష్టం చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించేందుకు ఉద్దేశించిన దుండిగల్‌లోని స్థలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ పరిశీలన ద్వారా సమ్మిట్ వేదికను ఖరారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఉన్నతాధికారులతో పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప దేవాలయం సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే దిగడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పారు.
విశాఖ జిల్లా శొంఠ్యంలోని శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆందోళన చేపట్టారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. గో మాంసం ఎగుమతులకు నిరసనగా కోల్డ్ స్టోరేజ్ ముందు ధర్నాకు దిగారు. లక్షల టన్నుల గో మాంసం నిల్వకు సహకరించిన కోల్డ్ స్టోరేజ్ యాజమాని సుబ్రమణ్య గుప్తాను అరెస్ట్ చేయాలని.. గో మాంసం ఎగుమతులపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
విజయవాడ జిల్లా జైలులో లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న A6-సజ్జల శ్రీధర్ రెడ్డి రెటీనా సమస్య కారణంగా విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఏఆర్, ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో పోలీసులు ఎస్కార్ట్‌గా తీసుకెళ్లారు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడవ రోజు నియోజకవర్గ పర్యటనలో ముస్లిం మైనారిటీలు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఉర్దూ కళాశాల, ఇతర సమస్యల పరిష్కారానికి, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా నినాదాలు చేశారు.
అనంతపురం జిల్లా సాయి నగర్ ఫస్ట్ క్లాస్‌లోని భారతి ఆసుపత్రి జనరేటర్‌లో మిస్టరీ శవం లభ్యం కావడం కలకలం రేపింది. శవం ఉబ్బిపోయి వాసన రావడంతో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ద్వజారోహాణముతో ప్రారంబమయ్యాయి. గజ చితపటాన్ని ద్వజస్థంబానికి అర్చకులు ఎగురవేసి బ్రహ్మోత్సవానికి దేవతలను అహ్వనించారు. ఈ కార్యక్రమంలో ఇవో అనిల్ కూమార్ సింఘాల్‌తో పాటు ఆలయ అదికారులు పాల్గోన్నారు. సాయంత్రం చిన్న శేషవాహానము పై అమ్మవారు మాడ వీదులలో విహారిస్తారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మొబైల్ ఫోన్ అనుమతి, ప్రమాదాల అంశాలపై డిమాండ్ చేస్తూ ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్లు నిరసన తెలిపారు. బస్సులు బయటకు తీయకుండా ఆందోళన చేయడంతో డీఎం కల్పన ఆదేశాలతో పోలీసులు డ్రైవర్లను అరెస్టు చేశారు. తమపై కక్షసాధింపు చర్యలు తీసుకున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో దారుణం జరిగింది. భార్యభర్తల కలహాల కారణంగా కారింగుల వెంకన్న గౌడ్, తన భార్య పద్మ(40)ను రోకలిబండతో కొట్టి చంపాడు. హత్య అనంతరం నిందితుడు వెంకన్న స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.
ములుగు జిల్లా లాలాయిగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన ఎలక్ట్రీషియన్ సమ్మయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మోటారు బిగించడానికి వెళ్లిన సమ్మయ్యను గుర్తు తెలియని దుండుగులు కట్టేసి కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పత్తి రైతులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మద్దతుగా నిలిచారు. మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీతో కలిసి ప్రారంభించారు. పత్తి రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలని, కొంత మినహాయింపులతో పత్తిని కొనుగోలు చేయాలన్నారు.
కడపలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ.. అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని ఆరోపించారు. ఘటన జరిగి రెండ్రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ శ్రేణులు.
అగ్ర కథానాయకులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు.
టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఓ సూచన చేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమి అనంతరం పేసర్ మహ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని గౌతీకి దాదా సూచించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, షమీ త్రయంపై గంభీర్ నమ్మకం ఉంచాలన్నాడు.