E-Paper
Advertisement

Hyderabad News: రోడ్డును కబ్జా చేసి.. బాధితులను బెదిరించి, బయటపడిన శ్రీధర్‌రావు బాగోతం

Hyderabad News: రోడ్డును కబ్జా చేసి.. బాధితులను బెదిరించి, బయటపడిన శ్రీధర్‌రావు బాగోతం
Advertisement

Hyderabad News:  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ల్యాండ్‌ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన సంధ్యా కన్వెన్షన్‌పై కొరడా ఝులిపించింది హైడ్రా. బాధితుల నుంచి ఫిర్యాదులు, ఇంకోవైపు హైకోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం భారీ క్రేన్లతో నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇంతకీ ఈ భూమి వివాదం వెనుక అసలేం జరిగింది? దీనిపై ఆ సొసైటీ ఏ మంటోంది?

సంధ్యా కన్వెన్షన్‌.. కొరడా ఝులిపించింది హైడ్రా

Advertisement

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో 20 ఎకరాల భూమి సొసైటీ కంట్రోల్‌లో ఉందన్నారు CIF ప్రెసిడెంట్ మూర్తి. 1981లో గ్రామ పంచాయతీ పరిధిలో FCI లేఅవుట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 20 ఎకరాల్లో 166 ప్లాట్స్‌తో లేఅవుట్ నిర్మాణం జరిగిందన్నారు.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు.. 162 ప్లాట్స్‌లో సుమారు 120 ప్లాట్స్ కొనుగోలు చేసినట్టు తెలిపారు.

ఆ తర్వాత రహదారులను కబ్జా చేయడం మొదలుపెట్టారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయనతో చాలాసార్లు పోరాటం చేసినట్టు తెలిపారు. ప్లాట్ ఓనర్స్ అందరం కలిసి టీమ్‌గా ఏర్పడి హైడ్రాను ఆశ్రయించారన్నారు. సీఐఎఫ్ ప్రెసిడెంట్ మూర్తి బిగ్ టీవీతో మాట్లాడారు.

Advertisement

FCI లేఅవుట్ వెనుక అసలేం జరిగింది?

ఆ భూమి సొసైటీ కంట్రోల్ ఉందన్నారు. ఆ తర్వాత ఆ భూమి వేర్వేరు వ్యక్తుల నుంచి చేతులు మారిందన్నారు. దీనికితోడు ఆ ప్రాంతంలో ధరలు పెరగడం వల్ల కంప్లీట్‌గా రోడ్లను ఆక్రమించినట్టు వెల్లడించారు. ఆ సొసైటీలోని ఫ్లాటు ఓనర్లు టీమ్‌గా ఏర్పడినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో కొన్ని కేసులు ఉన్నాయన్నారు.

FCI లేఅవుట్ సంధ్యా కన్వెన్షన్‌ పాత్ర ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ హౌసింగ్ సొసైటీ భూములని తెలిపారు. ఆ భూమిలో కొన్ని ప్లాట్లను ఆయన కొనుగోలు చేశారని తెలిపారు. మొదట్లో FCI కి సంబంధించిన బోర్డులను తొలగించి సంధ్యా కన్వెన్షన్ పేరిట బోర్డులు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.

ALSO READ: 43 లో 42 మంది చనిపోయారు.. అతనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు

ఆనాడు బోర్డులు తొలగించినప్పుడు తామేమీ మాట్లాడలేదని, ఆనాడు యాక్షన్ తీసుకోలేదన్నారు. రోజులు గడిచినకొద్దీ మిగతా బోర్డులు తొలగించి శ్రీధర్‌రావు బోర్డులు పెట్టుకోవడం జరిగిందన్నారు. బోర్డు ఎవరిది అన్న విషయం పక్కనబెడితే.. మా ప్లాట్లను హైడ్రా గుర్తించి ఇవ్వగలిగితే తామంతా హ్యాపీ అని అన్నారు. లేఅవుట్‌లో అన్ని ఫ్లాట్లు సేఫ్‌గానే ఉన్నాయని తెలిపారు.

ఆయన ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత సరైన సర్వే చేపట్టకుండా, కొన్నికొన్ని కమర్షియల్‌గా అద్దెకు ఇవ్వడం జరిగిందన్నారు. రోడ్లు సరైన విధంగా లేకపోవడం, ఫ్లాట్లు గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దాన్ని ఆయన కబ్జా చేశారని తాము చెప్పమని, ఎందుకంటే ఆయన కొనుగోలు చేశారని వివరించారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత FCI లేఅవుట్‌లో ఫ్లాట్ ఓనర్లకు బిగ్ రిలీఫ్ వచ్చినట్లయ్యింది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×