E-Paper
Advertisement

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు.

2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు..

ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, ఐబొమ్మ ప్లస్ అంటూ కొత్త పైరసీ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా మరో పైరసీ వెబ్‌సైట్ వెలుగు చూసింది. SBI టర్మ్ ఇన్సూరెన్స్ డాట్ కామ్ పేరుతో ఓ కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

3. ఏపీ సచివాలయంలో భారీ భద్రత ఏర్పాట్లు..

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంచారు పోలీసులు. విజయవాడలో మావోయిస్టుల అరెస్టులతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించడంతో భద్రత పెంచారు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, ఉద్యోగుల ఐడీ కార్డ్స్ పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

4. ములుగు జిల్లాల్లో గుప్తనిధుల తవ్వకాలు కలకలం..

ములుగు జిల్లా మంగపేటలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగపేటకు చెందిన నలుగురు సభ్యులు.. మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలోని.. ఓ ఇంటి పరిసరాల్లో గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. అక్కడి నుంచి గుప్త నిధి తెచ్చి స్వగ్రామంలో పాతి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

5. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. హీరోయిన్ నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి మధ్యాహ్నం విచారణకు రానున్నారు.

6. భారీగా పెరిగిన టామాటా ధరలు

టమాటా ధరలు భారీగా పెరిగాయి. గత వారం కిలో 10 రూపాయలు పలికిన టమాటా.. ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు దాటింది. దీంతో మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులకు ఇప్పుడు కొంత ఉపశమనం లభించింది. అయితే టమాట ధరలు పెరగడానికి కారణం ఉత్పత్తి తగ్గడమే.

7. దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం .

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట… ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు మల్లేశం అనే రైతు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. 29 గుంటల భూమిని అధికారులతో రిజిస్ట్రేషన్ చేయకుండా.. పర్వత్ విజయభాస్కర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు వేధిస్తున్నారంటూ బాధితుడు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.

8. పోలవరంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం..

పోలవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ తీరు, పురోగతిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి పోలవరం చేరుకుంది. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైన డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 , ECRF నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ప్రాజెక్టు నాణ్యత, నిర్మాణం వేగంపై ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

9. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు నిరసన..

ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ హైవేపై అఖిల పక్షం ఆధ్వర్యంలో పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. ఆందోళన చేపట్టి తీరుతామని ప్రతిపక్ష నాయకులు, రైతులు ప్రకటించారు. దీంతో భోరజ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

10. ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు..

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విధులలో నిర్లక్ష్యం వహించినందుకు జగన్మోహన్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈవో రంగనాయుడు చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు డీఈవో.

11. రైతుల సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై పోలీసులు భారీ బందోబస్తు

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ జాతీయ రహదారిపై భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల పక్షం కోరుతూ.. రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ముందస్తుగా పోలీసులు పహరా కాస్తున్నారు. రోడ్డు ఎక్కి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

12. భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బేకరీ

నిర్మల్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంచిర్యాల రోడ్డుపై గల బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు జిల్లా ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్.

13. హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ అభయ్ ఆగ్రహం

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడ్మా, హిడ్మా భార్య రాజేతో పాటు కొంత మందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులగా మార్చి క్రూరంగా హతమార్చారని లేఖలో ఆరోపించారు. ఈ హత్యలను మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ పేరుతో కట్టుకథ అల్లారని మండిపడ్డారు.

14. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌కు పొన్నం ఫోన్‌లో పరామర్శా

సిరిసిల్ల జిల్లాలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ బాలరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో పరామర్శించారు. డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు పొన్నం.

15. అప్పుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో 2 లక్షల అప్పు భారంతో వేధింపులకు గురైన యువకుడు శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. దీంతో అప్పులోళ్లు పెళ్లి ఎలా చేసుకుంటావు.. ఇంటికి తాళం వేస్తాం అంటూ వేధించడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

16. రంపచోదవరంలో మృతి చెందిన మావోయిస్టులకు పోస్టుమార్టం..

అల్లూరి జిల్లాలోని రంపచోదవరంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఇంకా తొమ్మిది మృతదేహాలు ఉంచారు. మొత్తం 13 మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం నలుగురికే పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

17. నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం..

నాగర్‌కర్నూల్ జిల్లా పల్కపల్లిలో గంజాయి కలకలం రేపింది. మత్తుకు బానిసై గ్రామానికి చెందిన నాగనులు మధు గంజాయి కొనలేక తన ఇంటి పెరట్లోనే రెండేళ్లగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు 20గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

18. రష్యాలో చమురు కంపెనీలకు ట్రంప్ ఆంక్షలు

రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీని నేపథ్యంలో భారత్, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో ఆ దేశ చమురు ధరలు పతనమైనట్లు ట్రెజరీ శాఖ సీనియర్ అధికారి విలేకరులతో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న నిధులపై ఒత్తిడి పెరిగిందన్నారు.

19. ముంబై జట్టును ముందుండి నడిపిస్తానన్న సూర్యకుమార్ యాదవ్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల దృష్ట్యా ఈ టోర్నీలో ఆడాలని సూర్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టీ20 టోర్నమెంట్‌లో ముంబై జట్టును సూర్య ముందుండి నడిపించనున్నాడు.

20. అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత

హీరోయిన అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె మూడు భాషల్లో నటించిన ఆరు చిత్రాలు విడుదలవగా డిసెంబర్ 5న లాక్‌డౌన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి సినిమాలో నటిస్తున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×