E-Paper
Advertisement

Telangana Politics: హీటెక్కిన ఫిరాయింపుల వ్యవహారం.. స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Telangana Politics:  హీటెక్కిన ఫిరాయింపుల వ్యవహారం.. స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం వేడెక్కిందా?  వచ్చేవారం ఆ ఇష్యూకి ముగింపు పలకనుందా? ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు .. స్పీకర్ నోటీసులపై స్పందించారు. విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో సమావేశమయ్యారు.

హీటెక్కిన ఎమ్మెల్యే ఫిరాయింపుల వ్యవహారం

Advertisement

ఫిరాయింపు వ్యవహారంపై పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 23న ఆదివారం తన ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. గడువుకు ముందే స్పీకర్‌ని కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వివరణ ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని లేఖ రాశారు.  కడియం లేఖపై సానుకూలంగా స్పందించారు స్పీకర్.

దాదాపు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. ఇక మిగిలింది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని దానం కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారట దానం నాగేందర్. ఈ నేపథ్యంలో దానం రాజీనామా చేస్తారనే వార్తలు లేకపోలేదు.  ఈనెల 23న స్పీకర్‌ను దానం కలుస్తారా? అంతకుముందే రాజీనామా చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. గాంధీభవన్ వర్గాలు మాత్రం  ఉపఎన్నికకు తాము సిద్ధమేనని చెబుతున్నాయి.

ALSO READ:  టీవీ డిబేట్‌లోని  లైవ్‌‌లో కొట్టుకున్న బీజేపీ-కాంగ్రెస్ నేతలు

జూబ్లీహిల్స్ బైపోల్‌లో విజయం సాధించారని, అదే జోరు కంటిన్యూ అవుతుందనే గుసగుసలు లేకపోలేదు. ఈ వ్యవహారంపై శుక్రవారం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.  కడియం శ్రీహరి కాపాడటానికి దానంతో రాజీనామా చేసే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు.  దీనిపై ఇప్పటివరకు దానం నోరు విప్పిన సందర్భం లేదు. కడియం మాత్రం పలు సందర్భాల్లో నోరు విప్పారు.  పోటీకి తాను సిద్ధమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన విషయం తెల్సిందే.

 

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×