E-Paper
Advertisement

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. ఆరుగురు మృతి, కోల్‌కతాలోనూ ప్రకంపనలు

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. ఆరుగురు మృతి, కోల్‌కతాలోనూ ప్రకంపనలు
Advertisement

Earthquake: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.7గా నమోదు అయ్యింది.  ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది.  అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం బంగ్లాదేశ్‌లోని నర్సింగ్దీ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. దాని ప్రభావం కోల్‌కతాపై పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అలాగే ఆఫీసుల్లో ఉన్నవారు బయటకు పరుగులుపెట్టారు.

బంగ్లాదేశ్‌లో భూకంపం, ఆరుగురు మృతి

Advertisement

బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 10 గంటల సమయంలో సంభవించింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లోని ఢాకా నుండి తూర్పు-ఆగ్నేయంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆ దేశ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రాజధాని ఢాకాలో కనీసం ఆరుగురు మరణించారు. ముగ్గురిపై భవనం పైకప్పు గోడ కూలిపోయింది.  మరో 65 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.  ముగ్గురు పాదచారులపై భవనాల రెయిలింగ్‌లపై పడి మరణించారని ఢాకా కేంద్రంగా పని చేస్తున్న డీబీసీ టెలివిజన్ పేర్కొంది.

భూకంపంలో గాయపడిన 10 మందిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మరో 10 మందిని గాజీపూర్‌లోని తాజుద్దీన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. నర్సింగ్డి జిల్లా ఆసుపత్రిలో 45 మంది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అలీపూర్‌కు చెందిన రవీంద్ర‌సింగ్ మాట్లాడుతూ ప్రకంపనలు 30 సెకన్లకు పైగా కొనసాగాయని తెలిపారు. మొదట తన కళ్లు తిరుగుతున్నాయేమోనని కుటుంబసభ్యులు ఈ విషయం చెప్పానని అన్నాడు. ఆ తర్వాత భూకంపమేనని స్పష్టమైందన్నాడు. బలమైన ప్రకంపనలు తాము చూశామని, భవనాలు చెట్లు వణికినట్టు ఢాకా నివాసి సుమన్ రెహమాన్ అన్నాడు.

Advertisement

కోల్‌కతాలోనూ ప్రకంపనలు, బయటకు పరుగులు

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్‌లతోపాటు మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి ఇతర రాష్ట్రాలలో స్పల్పంగా ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్టు గానీ, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు తెలియలేదు. భూకంపం సమయంలో కోల్‌కతా పరిసర ప్రాంతాల బెంబేలెత్తిపోయారు. ఇంటి ఫ్యాన్లు ఊగడం కనిపించడంతో బయటకు పరుగులు తీశారు. ఇక ప్రభుత్వం, ప్రైవేటు ఆఫీసులకు వెళ్లినవారు ఒక్కసారిగా భూమి కంపించడంతో వెంటనే బయటకు పరుగులు పెట్టారు. దాదాపు గంట వరకుగానీ ఉద్యోగులు ఆఫీసు లోపలికి వెళ్లలేదు.

ALSO READ: లుథియానాలో భారీ ఎన్‌కౌంటర్.. టెర్రరిస్టులకు గాయాలు

గురువారం పాకిస్తాన్‌లో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆదేశ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రాన్ని కనుగొన్నారు. దీనికారణంగా ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశం..  ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల మండలాల్లో ఒకటిగా ఉన్నాయి. భారత-యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతం కావడంతో మధ్యస్థం నుండి బలమైన భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×