E-Paper
Advertisement

Top 20 News Today: సీఎం చంద్రబాబు పై అంబటి ఆరోపణలు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Top 20 News Today: సీఎం చంద్రబాబు పై అంబటి ఆరోపణలు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

1. కేసీఆర్ పై ఎమ్మెల్యే అద్దంకి ఫైర్

కేసీఆర్ దీక్ష కంటే 1200 మంది అమరవీరుల త్యాగం గొప్పదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ దీక్ష, అందులో తీసుకున్న ఫ్లూయిడ్స్ అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణను ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ అవమానించాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలైన తెలంగాణ బిడ్డ అని, మానవీయ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

2. వివరాలు సేకరణ

ఐ బొమ్మ రవి రెండవ దఫా కస్టడీ పూర్తయింది. రవి మెయిల్ అకౌంట్స్‌ను రిట్రైవ్ చేశారు పోలీసులు. మెయిల్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లో రవి డేటా దాగి ఉన్నట్టు గుర్తించారు. ప్రహ్లాద్ గురించి వివరాలు సేకరించారు.

3. సీఎం చంద్రబాబు పై అంబటి ఆరోపణలు

అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిలో అడ్డగోలుగా భూ దోపిడీ చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారన్నారు. రైతుల నుంచి తొలివిడతలో తీసుకున్న భూములకు ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదన్నారు అంబటి రాంబాబ్.

4. పికప్ వ్యాన్ లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్

నిర్మల్ నుండి ఖానాపూర్ వైపు వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ నూతన కలెక్టర్ చౌరస్తా వద్దకు రాగానే ఇంజన్ భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, మరో వ్యక్తి వెంటనే వాహనం దిగి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో చేరుకుని మంటలను ఆర్పారు.

5. ఏకగ్రీవం చేయాలన్న గ్రామస్తులు

ఖమ్మం జిల్లా జోగుగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవిని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం వేలం ద్వారా ఏకగ్రీవం చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఉన్న ఈ పదవికి ఏడుగురు పోటీ పడగా.. వేలంలో సైదమ్మ భర్త 20 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. పార్టీలకతీతంగా ఏకగ్రీవం కోసం ప్రయత్నం జరుగుతున్నా, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

6. దేనికైనా సిద్ధం.. మాజీ వీసీ

కాళోజీ యూనివర్సిటీలో అక్రమాల పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు మాజీ వీసీ నందకుమార్‌రెడ్డి. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విశ్వ విద్యాలయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తాము యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చేందుకే పనిచేశాం తప్ప.. ఎలాంటి తప్పు చేయలేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు నందకుమార్‌రెడ్డి.

7. మియాపూర్ ఛైన్ స్నాచింగ్..

మియాపూర్ పోలీస్‌‌స్టేషన్ పరిధిలోని మయూరినగర్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. యశోద సాయి సన్నిధి నుండి మ్యూజికల్ అకాడమీ వైపు వెళ్తున్న అమూల్య మెడలోంచి 4 తులాల బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయాడు గుర్తు తెలియని వ్యక్తి. బాధితురాలు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

8. టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆరోపణలు

అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 100 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూమి దోపిడీకి టీడీపీ నేతలు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఈ భూ దోపిడీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

9. శివంగన పల్లి గ్రామ సర్పంచ్‌గా జ్యోతక్క

రాజన్నసిరిసిల్ల జిల్లా శివంగనపల్లి గ్రామ సర్పంచ్‌గా మాజీ నక్సలైట్ నేరెళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్క తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసి, 2023లో జనజీవన స్రవంతిలో కలిసింది జ్యోతక్క. ఇప్పుడు గ్రామాభివృద్ధికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శక పాలన అందిస్తానని తెలిపారు.

10. బాలాజీ స్కిన్ హాస్పిటల్‌కు కమిషనర్ అంటూ ఫేక్‌కాల్

జగిత్యాల జిల్లా కోరుట్లలోని బాలాజీ స్కిన్ హాస్పిటల్‌కు కమిషనర్ అంటూ ఒక ఫేక్‌కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి రిసెప్షనిస్ట్ వర్షిణిని బెదిరించి నోటీసులు, ఫైన్ విధిస్తామని హెచ్చరించాడు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆ సమయంలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నప్పుడే ఈ కాల్ రావడం చర్చనీయాంశమైంది.

11. ఢిల్లీ పేలుడు.. ఎన్ఐఏ దర్యాప్తు

ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. 30 మంది అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ డాక్టర్ల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎన్ఐఏ. వారి నుంచి ఉగ్రవాది ఉమర్ నబీ మహ్మద్ గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఉమర్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు.

12.ముగిసిన నామినేషన్ల గడువు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. మొదటి రెండు రోజులు మందకొడిగా నామినేషన్లు దాఖలైనప్పటికీ చివరి రోజు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు గాను 164 నామినేషన్లు దాఖలయ్యాయి.

13. కేసీఆర్ చిత్రపటానికి పాలాభి షేకం

దీక్షా దివస్ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ళ శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పాల్గొన్నారు.

14. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడానికి మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను బీఆర్ఎస్వీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, ఓయూ పోలీసులు చించివేసారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.

15. రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్‌వే పై ఆగిన ఇండిగో విమానం

రేణిగుంట అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏతలెత్తింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు వచ్చిన ఈ విమానం తిరిగి బయలుదేరే సమయంలో రన్‌వేపై ఆగిపోయింది. పైలట్లు లోపాన్ని గుర్తించి విమానాన్ని నిలిపివేయడంతో ప్రయాణికుల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం సాంకేతిక బృందం వెంటనే రన్‌వేకు చేరుకొని లోపం సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

16. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరనుంది. ప్రభుత్వం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా.. విపక్షాలు అదానీ అంశం, ఢిల్లీ పొల్యూషన్ వంటి అంశాలను లేవనెత్తనున్నాయి.

17. ఎయిర్ బస్ విమనాల్లో సాంకేతిక సమస్యలు

ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో భారత సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ బస్ హెచ్చరికల గురించి యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సోలార్ రేడియేషన్ కారణంగా ఈ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లు పేర్కొంది.

18. ప్రధాన హోదాలో పెళ్లి

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్ ను కాన్ బెర్రాలోని తన అధికారిక నివాసం ‘ది లాడ్జ్’లో వివాహం చేసుకున్నారు. ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తి ఈయనే. ఐదేళ్ల పరిచయం కాగా.. రిలేషన్షిప్ తర్వాత వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అల్బనీస్‌కు ఇది రెండో వివాహం కావడం విశేషం.

19. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

అఖండ-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు చాలా పనులు ఉన్నాయి కానీ.. ఒక్కరే భార్య అంటూ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు..? అసలు భార్య ప్రస్తావన ఎందుకు తెచ్చారనే చర్చ సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది.

20. WPL 2026 సీజన్ షెడ్యూల్ విడుదల

WPL 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 9న నవీ ముంబయిలో.. ముంబయి ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే ఫిబ్రవరి 5న వడోదరలో ఫైనల్ జరుగుతుంది. నవీ ముంబాయి, వడోదర వేదికల్లోనే మొత్తం మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఆక్షన్‌లో దీప్తి శర్మ అత్యధికంగా రూ.3.20 కోట్లు పలికింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×