BigTV English

OTT Movie : ప్రియుడిని కాదని తండ్రిని ప్రేమించే కూతురు … ఈ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ కి బుర్ర కరాబ్

OTT Movie : ప్రియుడిని కాదని తండ్రిని ప్రేమించే కూతురు … ఈ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ కి బుర్ర కరాబ్

OTT Movie : థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో చూడకపోయినా, ఓటీడీలో తమకు నచ్చిన సినిమాలను చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో కొన్ని సినిమాలు చాలా డిఫరెంట్ గా వస్తాయి. వీటిని చూడాలన్న కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, తండ్రి కూతుర్ల మధ్య రిలేషన్ చూపిస్తారు. అయితే ఈ రిలేషన్ ఒక దశలో పక్కదారి పడుతుంది. ఇందులో క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆలోచనలో పడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


ఆపిల్ టివి (Apple TV) లో

ఈ ఇజ్రాయెలీ-ఫ్రెంచ్ డ్రామా మూవీ పేరు ‘దట్ లవ్లీ గర్ల్’ (That Lovely Girl). కెరెన్ యెడయా దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మేయెన్ తుర్గేమాన్, జాహి గ్రాడ్, యేల్ అబెకాసిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమీ అనే యువతి, ఆమె తండ్రి మోషే చుట్టూ తిరుగుతుంది. సున్నితమైన అంశాలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఇది 2014 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో పోటీ చేయడానికి ఎంపికైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆపిల్ టివి (Apple TV) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే 

తమీ అనే అమ్మాయి, యాభై సంవత్సరాల వయసు ఉన్న తండ్రితో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. తల్లిలేకపోవడంతో తండ్రితోనే ఎక్కువగా సమయం గడుపుతుంది. అలా ఎక్కువగా గడపడం వల్ల, వీరి మధ్య సంబంధం అసాధారణంగా మారుతుంది. ఇది తమీకి మానసికంగా, శారీరకంగా హాని కలిగిస్తుంది. వారి రోజువారీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. తమీ ఎంత ప్రయత్నించినా, తన తండ్రితో ఉన్న సంబంధం నుండి బయటపడలేకపోతుంది. ఇది భరించలేక, తమీ తన తండ్రి నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తుంది. దీని నుంచి బయటపడటానికి ఒకానొక సమయంలో, షుకీ అనే వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుంటుంది. కానీ ఆమె మానసిక సమస్య మళ్లీ తండ్రి వైపు వెళ్ళే లా చేస్తుంది. తమీ తన పరిస్థితి తీవ్రతను గ్రహించి, తనను తాను విముక్తి చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది.

చివరికి తమీ తీసుకున్న నిర్ణయం ఏంటి ? తన తండ్రితోనే సంబంధం ఎందుకు పెట్టుకుంది ? తమీ ఈ విషయంలో ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? తన బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు వదిలిపెడుతుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా తండ్రి-కూతురు మధ్య అనైతిక సంబంధం, లైంగిక వేధింపు, మానసిక గాయం వంటి సున్నితమైన అంశాలతో తిరుగుతుంది. ఈ సినిమాను చూడడం కష్టంగానే ఉంటుంది. తండ్రి , కూతుర్లను అలా ఊహించుకోవడం ఎవరికీ నచ్చదు. ఈ సినిమాలో కూడా బో*ల్డ్ సీన్స్ ఉన్నందువల్ల, మీరు ఒంటరిగానే చూడటం మంచిది.

Read Also : బట్టల షోరూమ్ లో ఉన్న బొమ్మలు ఇంత డేంజరా ? క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×