OTT Movie : కొన్ని కొరియన్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనూ హారర్ జానర్ లో వచ్చే సినిమాలను కొత్త తరహాలో చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, పది చిన్న కధల సమూహంతో తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ మూవీ పేరు ‘Urban Myths: Tooth Worms’ 2022 లో విడుదలైన ఈ కొరియన్ సినిమాకి హాంగ్ వోన్-కీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో పది చిన్న కథలు ఉన్నాయి. ఈ కథలు రోజువారీ జీవితంలో, సాధారణంగా కనిపించే ప్రదేశాల్లో జరిగే భయంకర సంఘటనల ఆధారంగా రూపొందించారు. అవి అంతస్తుల మధ్య శబ్దం, పాత ఫర్నిచర్, టన్నెల్‌లు, సోషల్ మీడియా వంటి విషయాల చుట్టూ తిరుగుతాయి. ఈ మూవీ ఏప్రిల్ 27, 2022న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత జపాన్, థాయిలాండ్, తైవాన్ సహా 13 దేశాల్లో ప్రదర్శించబడింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథలో చూంగ్-జే అనే ఒక డెంటిస్ట్ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. అతని దగ్గరికి ఒక రోగిని తీవ్రమైన పంటి నొప్పి తో వస్తాడు. కానీ సమస్య ఏమిటో కనుగొనడంలో అతను ఇబ్బంది పడతాడు. ఒక సహోద్యోగి సూచనతో, ఈ నొప్పికి కారణం దంతాలలో ఉండే ఒక వింత పరాన్నజీవి (Tooth Worm) అని తెలుస్తుంది. చూంగ్-జే ఆ పరాన్నజీవిని తొలగించే ప్రయత్నం చేస్తాడు. కానీ కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది జాంబీ లాంటి సంఘటనల వైపు దారితీస్తుంది.
ఈ సినిమాలోని మిగతా స్టోరీలు ఇలా ఉన్నాయి
The Tunnel: గి-హూన్ అనే వ్యక్తి రాత్రి చేపలు పట్టడం కోసం ఒక టన్నెల్ ద్వారా వెళ్తాడు. అక్కడ అతను వింత అనుభవాలను ఎదుర్కొంటాడు. అక్కడ ఏదో శక్తి అతన్ని ప్రభావితం చేస్తుంది.
The Woman in Red: సూ-జిన్ తన స్నేహితురాలు హ్యూన్-జూని బాధపెట్టి ఆమె ఆత్మహత్యకు కారణమవుతుంది. ఆమె ఒక కొత్త అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లినప్పుడు, ఆమెను ఎర్ర దుస్తుల్లో ఒక ఆత్మ వేధిస్తుంది.
Necromancy: స్కూల్ బెస్ట్ ఫ్రెండ్స్ నెక్రోమాన్సీ ఆడతారు, ఇది భయంకరమైన సంఘటనలకు దారితీస్తుంది.
The Wall: కొత్త అపార్ట్‌మెంట్‌లో గోడల్లో సీక్రెట్స్ దాగి ఉన్నాయని తెలుస్తుంది.
The Closet: పాత ఫర్నిచర్ నుండి వచ్చే భయానక సంఘటనలు.
Ghost Marriage: ఒక వ్యక్తిని మోసం చేసి చనిపోయిన ఆడపిల్లతో వివాహం చేస్తారు.
The Girl in the Mirror: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఒక ఆత్మ భయపెడుతుంది.
A Mannequin: బట్టల షోరూమ్ లో ఉన్న బొమ్మలు జీవం పోసుకుని ఒక వ్యక్తిని వెంటాడతాయి.
Escape Games: ఎస్కేప్ రూమ్ గేమ్ ఆడే టీనేజర్లు సాతానిస్టుల చేతిలో చిక్కుకుంటారు.
ఈ మూవీ కొరియన్ జానపద కథలతో , ఆధునిక జీవన శైలిని మిక్స్ చేసి, రోజువారీ జీవితంలో జరిగే సాధారణ విషయాలను భయంకరంగా చూపించే ప్రయత్నం చేసింది.
Also Read : అర్థరాత్రి ఆడ దెయ్యం అరాచకం… ఈ కొరియన్ హారర్ మూవీ చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే