Intinti Ramayanam Today Episode April 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి చక్రధరితో మాట్లాడడానికి బయటకు వస్తుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. చక్రధర్ రాగానే తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇంట్లో జరిగినా గొడవల గురించి వివరిస్తుంది. ఏంటమ్మా పల్లవి నేను లేను కదా అనేసి నాకు ఏ విషయం చెప్పలేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని చక్రధర అడుగుతాడు. ప్రణతికి పెళ్లి సంబంధం చూశారు డాడ్. అబ్బాయి లండన్ లో ఉండడంవల్ల అంతా రెండు మూడు రోజుల్లోనే ఎంగేజ్మెంట్ పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ ప్రణతికి ఆ పెళ్లి ఇష్టం లేదు తను ఎవరినో ప్రేమించానని ఇంట్లో లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏంటంటే తను పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అని తన తండ్రికి అసలు విషయాన్ని చెప్తుంది పల్లవి. ప్రణతి ప్రేమించింది, పెళ్లి చేసుకుంది ఆ భరత్ నేను ఆ భరత్ అడ్డు తొలగించాలని చక్రధర్ తో పల్లవి అంటుంది. ఇంటికి వెళ్లి శ్రీ అని చెప్పిన మాటకు పల్లవి సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని శాశ్వతంగా ఇంటికి దూరం చేశానని పల్లవి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. అయితే అక్షయ బావతో అవని అక్కకు విడాకులు ఇప్పిచ్చేసి ఇంకో పెళ్లి చేస్తే నా పని అయిపోతుంది అప్పుడు ఇంట్లో వాళ్లకి నా మీద అనుమానం వచ్చినా ఏమీ చేయలేరని సంబరపడిపోతూ నవ్వుకుంటుంది. అప్పుడే అవని ఫోన్ చేస్తుంది. ఏంటి అవని ఫోన్ చేస్తుంది శ్రీరామనవమి జరగదని వాళ్ళ మరదలు చెప్పారేమో కళ్యాణం జరిపించడానికి నాకు కాళ్లు పట్టుకొని ఒప్పించమని అడగడానికి ఫోన్ చేసిందేమో అని అనుకుంటుంది.. ఆ మేటర్ లో ఇన్వాల్వ్ కావద్దనింది నాకు చెప్పుతో వార్నింగ్ ఇచ్చింది. నన్ను చంపలు పగలగొట్టింది. ఎలాగైనా నేను రివెంజ్ తీర్చుకోవాలి. ఏంటో కనుక్కోవాలని ఉంటుంది.
పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటక్కా నాకు ఫోన్ చేసావ్ చాలా ఆశ్చర్యంగా ఉందే నువ్వు నాకు ఫోన్ చేయడమేంటి అని అడుగుతుంది. నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి నేను లొకేషన్ పంపిస్తాను నువ్వు రావాలి అని అడుగుతుంది.. నేను నువ్వు చెప్పినట్టు రావాలా అని పల్లవి అనగానే అయితే నేనే ఇంటికి వచ్చి మాట్లాడుతాను అసలు విషయం అందరికీ తెలుస్తుంది కదా అని అంటుంది. ఏదో అవనికి తెలిసినట్లు ఉంది నేను అదేదో కనుక్కోవాలి వద్దక్క నేనే వస్తానని అంటుంది.
పల్లవి వెంటనే అవని పిలిచిన దగ్గరికి వెళుతుంది. ఏమైందని అడగ్గని నువ్వు సీతారాముల వారి కళ్యాణం జరిపించడానికి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాలి. మేమిద్దరం పీటల మీద కూర్చునేలా చేసి ఈ కళ్యాణం జరిగేలా చేయాలి లేదంటే మాత్రం నువ్వు వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది. తాటాకు చప్పులకు పల్లవి భయపడదు అని వెళ్ళిపోతుంది. అవని పల్లవిని చిటికేసి ఆపుతుంది. నువ్వు ఆరోజు దాచిన రహస్యం ఇప్పుడు అందరికీ చూపిస్తే ఏమవుతుందో తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ నేను చీకొట్టడమే కాదు చంపి పాత్ర వేస్తారు అని అంటుంది.
నా ఫోన్లో ఈ వీడియో ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను చెప్పినట్లు ఆడాల్సిందే నేను చెప్పినట్టు చేయాల్సిందే అని ఓ ఆట ఆడుకుంటుంది. పల్లవి మొదట టెన్షన్ పడుతుంది తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తానక్కా ఆ వీడియోని మాత్రం ఎవరికీ చూపించదు అని భయపడుతుంది. ఇంటికి వెళ్ళగానే అందర్నీ కేకలు వేసి పిలుస్తుంది. ఏమైంది ఎందుకు ఇలా అరుస్తున్నావు అంటే సీతారాముల వారి కల్యాణం జరిపిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మామయ్య జరిపిద్దామని అందర్నీ అడుగుతుంది.
రాజేంద్రప్రసాద్ పల్లవి చెప్పిన మాటలు విని నువ్వు చెప్పింది కూడా నిజమే మనము సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని ఒప్పుకుంటాడు. అవని లేకుండా ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు.. అందరూ ఒప్పుకున్నారు కదా అత్తయ్య మీరు కూడా ఒప్పుకోండి అని ఒప్పిస్తుంది. ఇక ఉదయం సీతారాముల కళ్యాణం జరగనుంది కాబట్టి మనందరం తొందరగా లేసి గుడికి వెళ్లాలని పార్వతి అంటుంది. అందరూ గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు. అవని కూడా గుడికి వెళ్లేందుకు పట్టుచీర కట్టుకొని రెడీ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఎపిసోడ్లో పల్లవి గురించి నిజాలను బయట పెడుతుందా లేదా అన్నది చూడాలి..