E-Paper
Advertisement

Radha Raman Temple : అఖండ కొలిమి ఉన్న ఏకైక ఆలయం

Radha Raman Temple : అఖండ కొలిమి ఉన్న ఏకైక ఆలయం
Advertisement

Radha Raman Temple : భారతదేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయంలో భక్తులు ఒక్కోరకంగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.భక్తుల విశ్వాసం, భక్తితో పాటు భగవంతుని లీలలు, అద్భుతాలు నేటికీ భారతదేశంలోని దేవాలయాల్లో కనిపిస్తాయి.మథురలోని బృందావంధామలోని 7 దేవాలయాలలో ఒకటైన రాధారామన్ దేవాలయం ఎన్నో దశాబ్దాల నాటిది. అద్భుతమైన ఈ దేవాలయానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే.

దేవతలను భక్తితో పూజించడం కూడా ఎక్కువే..భక్తితో పాటు భగవంతుని లీలలు, అద్భుతాలు నేటికీ రాధారామన్ ఆలయంలో కనిపించడం భగవంతుడి మహిమే. ఐదు శతాబ్దాలుగా అక్కడ భగవంతుని అద్భుతం, అద్వితీయమైన లీల కొనసాగుతోంది. ఇక్కడి ఆయల ఆవరణలో భగవంతుడి ప్రసాదాలు తయారు చేసేందుకు గత 480 సంవత్సరాలుగా కొలిమి నిరంతరం మండుతూనే ఉంది.

Advertisement

ఐదు శతాబ్దాలుగా అక్కడ భగవంతుని అద్భుతం, అద్వితీయమైన లీల కొనసాగుతోంది.ఇక్కడి ఆయల ఆవరణలో భగవంతుడి ప్రసాదాలు తయారు చేసేందుకు గత 480 సంవత్సరాలుగా కొలిమి నిత్యం మండుతూనే ఉంటుంది. దేవుని కార్యాలన్నీ పూర్తయిన తర్వాత రాత్రిపూట కొంత కలపను ఉంచి, అగ్ని చల్లబడకుండా పై నుండి బూడిదను కప్పిఉంచుతారు. మరుసటి రోజు ఉదయం, అదే మంటలో కొంత ఆవు పేడ పీడకలు, ఇతర కట్టెలు వేసి మిగిలిన బట్టీలను వెలిగిస్తారు.

ఈ పవిత్రమైన అఖండ జ్యోతి నుండి పొందిన అగ్నిని జ్వాలతో దీపాలు, జ్వాల వెలిగించడంతో పాటు దేవుడికిచ్చే హారతిలోనూ ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలాంటి జ్యోతి ప్రజ్వలన చేసినా అగ్గిపెట్టె వాడరు. బదులుగా ఈ కొలిమి మంట నుండి వచ్చే అగ్నిని మాత్రమే వాడుకుని భగవంతుని నైవేద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు..వంటగదిలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. ఈ ఆలయ సేవకుడికి ధోతి తప్ప వేరే బట్టలు ఉండవు. వంట గదిలోకి వెళ్లిన తర్వాత, ప్రసాదం మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తారు. మధ్యలో ఒకసారి అతను బయటకు రావలసి వస్తే ఆలయంలోని పవిత్రమైన వంటగదిలోకి ప్రవేశించడానికి అతను తిరిగి స్నానం చేయాల్సి ఉంటుంది.. లేనిచో ప్రవేశం లేదు..ఈ జ్యోతిని దర్శించుకునేందుకు ఏటా చాలా మంది భక్తులు వస్తుంటారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×