BigTV English

Tirupati: తిరుపతి ఏడు కొండలు ప్రత్యేకతలు

Tirupati: తిరుపతి ఏడు కొండలు ప్రత్యేకతలు

Tirupati:కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడు తిరుమలలో ఏడు కొండలపై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. తిరుపతి నుంచి తిరుమల వరకు ఉన్న ఏడుకొండలు ఎక్కుతుంటారు. ఇంతకీ ఏడు కొండల ప్రత్యేకత ఏంటి…..


  1. వృషభాద్రి
    పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దం చేశాడు. సమరంలో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించమ్మని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వృషభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చింది.
  2. నీలాద్రి
    స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొనదలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు .
  3. గరుడాద్రి
    శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందుకే అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది
  4. అంజనాద్రి
    సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . తానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి,చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .
  5. నారాయణాద్రి
    నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది .
  6. వేంకటాద్రి
    వేం అనగా సమస్త పాపాలనుకటః అనగా దహించునది అంటే పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .
  7. శేషాద్రి
    ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . “నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు “అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని విసిరేయగా పర్వతంతో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా బాధతో ఉన్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,”నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుందని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ కొండ శేషాద్రిగా ప్రసిద్ది పొందింది . ఈ విధంగా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద ఆసీశుడై తన చల్లని చూపులతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×