BigTV English

Kuber Idol: కుబేరుడి విగ్రహం గృహంలో పెట్టుకోవచ్చా..

Kuber Idol: కుబేరుడి విగ్రహం గృహంలో పెట్టుకోవచ్చా..

Kuber Idol:మార్కెట్లో దొరికే లాఫింగ్ బుద్దను కొంతమంది కుబేరుడు రూపం అనుకుంటారు. కాని అది వాస్తవం కాదు . అవి అనుకరణతో చేసినవి మాత్రమే. కొన్నిసార్లు నమ్మకాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఫలితాలు బట్టి నమ్మకాలు మారతాయి. ఇవి ఒకటి దానికొకటి ఇంటర్ లింక్ అని చెప్పుకోవచ్చు. కుబేరుడికి సంబంధించి ఒక ప్రామాణికత ఉంది. దాన్ని మనం అనుసరిస్తున్నాం. కుబేర మంత్రం, కుబేర జపం ఉంటుంది. ఈ బీజాక్షరాలతో యంత్ర జపం ఉంటుంది. ఆ యంత్రాన్ని ప్రతిష్టించుకుని కుభేర జపాన్ని రోజూ ఐదుసార్లు కానీ పద కొండు సార్లు పటించడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది.


ఎవరైనా ఈ ప్రయత్నం చేయచ్చు. యంత్రం రచన ఏవిధంగా చేయాలి..ఏవిధంగా పూజ చేయాలన్న దానికి ఒక పద్ధతి ఉంది. కుబేరుడు అంటే ధనానికి ప్రతీక. నవ నిధులకు ఆయన సంరక్షకుడు. ఆయన అనుగ్రహం కలిగిందంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. నవ నిధులు అంటే బంగారం, రాశులు, రత్నాలు కాదు. నవ విధులు. భూమండలంమంతా కలిపి మట్టితో సహా నవ నిధులో ఒకటి. ప్రాణాన్ని పోసేది మట్టి .భూమి లోపలకు ఏదైనా వెళ్తే అది శిధిలమైపోయినట్టే. విత్తనం పడితే ప్రాణంతో పైకి మొలకెత్తుతుంది. అందుకే భూమి కూడా నవ నిధులలో ఒకటి.

బంగారం, వెండి, రత్నాలను నవ నిధులుగా భావించకుండా విస్తృత అర్థంలో తీసుకోవాలి. విశ్వంలో ఉన్న ధనమంతటికి సంరక్షకుడు ఈశ్వరుడు. ఈవిధంగా వారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు కొంత ధనం సమకూరుతుంది. ఫెంగ్ షుయిలో చూపించే లాఫింగ్ బుద్ద వేరు మన పురాణాల్లో చెప్పే ఉత్తర దిక్పాలకులు కుబేరుడు వేరు. కాబట్టి కుబేరుడ్ని పూజించడం వల్ల తప్పక మంచి ఫలితాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే…ఆయన్ను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కుబేరుడి అనుగ్రహం ఇంట్లో సంతోషం, సంపద, శ్రేయస్సు కలిగి ఉంటాం. ఇంటికి ఉత్తరం దిశగా ఎటువంటి చెత్త వేయకూడదని, ఉత్తరదిశలో మర్చిపోయి కూడా మూత్ర విసర్జన వంటివి చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.


Tags

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×