E-Paper
Advertisement

Car insurance: ఊహించని కారు ప్రమాదాలు.. ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ ఉంటే మేలు..!

Car insurance: ఊహించని కారు ప్రమాదాలు.. ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ ఉంటే మేలు..!
Advertisement

Car insurance : కారు కొనుక్కోవాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుటుంబాల కల. ఆ కలను నిజం చేసుకునే అవకాశాన్ని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. ఫైనాన్స్‌ను, లోన్‌లను అందిస్తూ కారు కొనాలనుకునే వారి కలను నిజం చేస్తున్నాయి. కానీ కారు కొనుక్కుంటే సరిపోదు కదా.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఇన్సూరెన్స్ అనేది అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా వర్షాకాలంలో కారు ప్రమాదాలు జరిగితే.. ఎలా అని ముందస్తుగా ఆలోచించేవారికి కూడా ఎన్నో యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి.

వర్షాకాలంలో రోడ్లు బాలేకపోవడం వల్ల, స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల.. ఇలా పలు కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. హైవే మీద నుండి వెళ్తే రోడ్లు నీళ్లతో నిండిపోయి.. ఎక్కవ మ్యాన్‌హోల్ ఉందో కనిపించకుండా ఉంటుంది. అదే మట్టి రోడ్డు నుండి వెళ్తే బురద వల్ల కారు టైర్లు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వర్షాకాలంలో డ్రైవ్ చేయడం కష్టమని కొందరు ఫీల్ అవుతుంటారు. అలాంటి సమయంలో కారు అదుపుతప్పి ఏ ప్రమాదానికి గురవుతుందో ఎవరూ ఊహించలేరు.

Advertisement

కారు ప్రమాదాలకు ముందస్తు చర్యగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అందరికీ అవసరం. ఏదైనా ప్రమాదం జరిగి బండికి ఏదైనా అయితే.. ఇన్సూరెన్స్ అనేది కారు ఓనర్లకు ఆర్థిక సాయం చేయగలుగుతుంది. కానీ కొన్ని ప్రమాదాలకు ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ చేయడం కష్టం. ఇలాంటి ప్రమాదం జరిగితే మాత్రమే.. ఇన్సూరెన్స్ లభిస్తుంది అని ముందుగానే కండీషన్స్‌లో స్పష్టంగా తెలియజేస్తాయి కంపెనీలు. అందుకే వర్షాకాలంలో జరిగే ప్రమాదాల కోసం ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్నవారికి కొన్ని యాడ్ ఆన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

కన్స్యూమబుల్స్ కవర్.. ఈ ఇన్సూరెన్స్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లేదా వర్షాకాలంలో నీళ్లు కారు లోపలికి వెళ్లి వెహికల్ దెబ్బతిన్నప్పుడు ఉపయోగపడుతుంది. లోపలికి నీళ్లు చేరినప్పుడు ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్, ఇతర ప్లూయిడ్స్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఇన్యూరెన్స్ ఉంటే ఆర్థికంగా సాయంగా ఉంటుంది. ఇంకొకటి జీరో డిప్రిసియేషన్ కవర్. ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే దెబ్బతిన్న కారు లేదా మరమ్మత్తులకు అసవరమయ్యే స్పేర్ పార్ట్స్ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఇక హైడ్రోస్టాటిక్ లాక్ కవర్ ఇన్సూరెన్స్. ఇది దెబ్బతిన్న ఇంజిన్‌ను రిపేర్ చేయాడానికి ఉపయోపడుతుంది. అంతే కాకుండా బ్రేక్ డౌన్, ఫ్లాట్ టైర్లు అయినప్పుడు చాలా వినియోగించుకోవచ్చు.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×