BigTV English

Tirupati : గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Tirupati : గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం


Tirupati news today live(Breaking news in Andhra Pradesh): తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు ఇళ్ల వైపు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

5 అంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ షాపు ఉంది. షార్ట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అందులో ఫొటోలు దగ్ధమయ్యాయి. వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే 3 అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.


ప్రమాదం జరిగిన భవనం ముందు ఉన్న 5 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×