BigTV English

Tips for a good day : ఏరోజైనా సరే మీరు మొదలు పెట్టే పని నెరవేరాలంటే ఇలా చేయండి…

Tips for a good day  : ఏరోజైనా సరే మీరు మొదలు పెట్టే పని నెరవేరాలంటే ఇలా చేయండి…

Tips for a good day : భూమ్మీద ఎంతో మంది ఉన్నా అందులో మహర్ జాతకులు కొందరే. మరి మిగతాళ్ల సంగతేంటి..కష్టాల్లో కొట్టుకుపోవాల్సేందేనా…అలాంటి వారికి దారి చూపిస్తుంది బెల్లం, మిరియాలు . జాతకంలో దోషాలు ఎక్కువ ఉన్న వాళ్లు ప్రతీ రోజు బయటకివెళ్లే టప్పుడు ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లండి .బెల్లం ముక్క నోట్లే వేసుకుని తింటూ వెళ్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడు గ్రహాలకు రాజు అందువల్ల జాతక దోషాలు తొలగి మీరు అనుకున్న పనులు ముందుకెళ్తాయి. అలాగే ఏదైనా ఒక కార్యం కోసం వెళ్తున్నప్పుడు గుమ్మం బయట మిరియాలు ఉంచి వాటిని తొక్కి ముందుకు వెళ్తే ఇక నుంచి వెనక్కి చూడాల్సి పనిలేదు. ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలా తొక్కిన మిరియాలు తుడిచి తర్వాత డస్ట్ బిన్ లో వేసేయమని ఇంట్లో వాళ్లకి చెప్పండి చాలు.


ఆ మిరియాలను తొక్కే టప్పుడు కుడికాలితో తొక్కితే సరిపోతుంది. రోజుకో పరిహారం పాటిస్తే సమస్యలు ఎదురుకావాలని పరిహారశాస్త్రం చెబుతోంది. సోమవారం నుంచి బయటకెళ్లేటప్పుడు అద్దంలో ముఖం చూసుకుని బయటకి వెళ్తే ధన లాభం కలుగుతుంది. అన్ని రకాలుగా కలసి వస్తుంది. మంగళవారం నాడు బయటకి వెళ్లే టప్పుడు తీపిపదార్థం నోటిలో వేసుకుని బయటకి వెళ్లాలి. అలా చేస్తే అన్ని పనులు అవుతాయి. కార్యజయం కలుగుతుంది. అదే బుధవారం రోజు బయటకి వెళ్లేటప్పుడు పుదీనా ఆకులు నోట్లో వేసుకుని నములుతూ వెళ్లాలి. అలా వెళ్తే బుధవారం అంతా జయమే జరుగుతుంది. ఇక గురువారం నాడు బయటకి వెళ్లేటప్పుడు రెండు నల్ల ఆవాలు నోట్లో వేసుకుని అడుగుపెట్టాలి. అలా చేస్తే మీరు చేసి పని ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. శుక్రవారం నాడు బయటకి వెళ్లేటప్పుడు మాత్రం ఒక చెంచా పెరుగు తిని బయటకి వెళ్లాలి. అలా తింటే మొదలుపెట్టే పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది.

అదే శనివారం రోజు బయటకి అడుగుపెట్టేప్పుడు ఆవు నెయ్యి తినాలి. అది లేకపోతే కనీసం అల్లం ముక్కైనా నోట్లో పెట్టుకుని బయటకి అడుగులు వేయండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదివారం పని తలపెడితే రెండు తమలపాకులు మీ దగ్గర పెట్టుకుని వెళ్లండి .ఆ వేళ అనుకున్న పనులు ఏవీ ఆగవు. ఇలా మహర్షులు ఏ రోజు ఏం చేస్తే వెళ్తే కలిసి వస్తుందో చెప్పారు. బెల్లం, మిరియాలతో మీరు ఈ ప్రయోగాన్ని చేయండి.. జాతక దోషాలు తొలగిపోయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్య రిత్యా కూడా బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తాయి. చలికాలంలో బెల్లం, ఎండుమిర్చి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×