BigTV English

Main door: గుమ్మం ముందు పెట్టిన యంత్రాలు పనిచేస్తాయా…

Main door: గుమ్మం ముందు పెట్టిన యంత్రాలు పనిచేస్తాయా…

Main door: బయటి వారు మనం ఇంటిని చూసే చూపులో కొంత భయాన్ని , ఉద్వేగాన్ని, భిన్నమైన ఆలోచనలు కలిగించయడానికి యంత్రాలు ఉపయోగపడతాయి. నర దిష్టి యంత్రం, కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం ఇలా ఎన్నోరకాలు పుట్టుకొచ్చాయి. చెప్పాలంటే యంత్ర వ్యవస్థ కాస్త యాంత్రిక వ్యవస్థగా బిజినెస్ గా మారిపోయిందని చెప్పచ్చు. గంటకి లక్షల్లో ముద్రించే యంత్రాలుకి లెక్కే లేదు. అలా తయారైన వాటిని మనం ఇళ్ల ముందు వేలాడదీస్తున్నాం. చెప్పాలంటే శరీరమే యంత్రం. శ్రీ చక్రమంటే యంత్రమే. యంత్రంలో ఉన్న మంత్రాన్ని సాధకుడు అక్షర లక్షలు జపం చేయాలి. ఏ యంత్రమైనా ఆ యంత్రంలోని మంత్రాన్ని సాధక్షుడు అక్షరాలకు అనుగుణంగా ఒక్కో అక్షరాన్ని లక్షలసార్లు జపాలు చేయాలి. అలా అన్ని సార్లు అనడంలో మాటల్లో ఉద్వేగం, ఆకర్షణా శక్తి. వశీకరణ శక్తి ఏర్పడుతుంది. అలా వచ్చిన శక్తి యంత్ర నిర్మాణాన్ని చూసి సాధక్షుడు అక్షింతలు వేస్తేనే ఆ యంత్రాల్లోకి శక్తి వస్తుంది.


అలా వచ్చిన యంత్రాలే వశీకరణ యంత్రాలు. షాపుల ముందు పెట్టుకుంటారు. కస్టమర్లను బాగా ఆకట్టుకోవాలని వేలాదీస్తుంటారు. అంత మంత్రి శక్తి ఉంటేనే యంత్రం విలువ ఉంటుంది . లేకపోతే అది అలంకార ప్రాయంగా మాత్రమే మిగిలిపోతుందని గుర్తుంచుకోవాలి. కాకపోతే యంత్రంలో ఏదో ఉందనే ఆలోచనను పరోక్షంగా పనిచేస్తాయి. నిజానికి ఏ వస్తువు అయినా కచ్చితంగా ఫలితం వచ్చేస్తుంది అనే గారంటీ ఇవ్వరు. ఎందుకంటే అందరికీ అన్ని వస్తువులు అన్ని సమయాల్లో ఫలితం ఇవ్వకపోవచ్చు లేదా వాటి యొక్క ఫలితం గ్రహించే శక్తీ దానిని ఉపయోగించే వారికి తెలియకపోవచ్చు.

నరఘోష యంత్రాన్ని తీసుకుంటే దానిని స్థాపించిన దగ్గర నుండి దాని పని అది చేసుకుంటుంది. అయితే ఇది మన కంటికి కనబడదు కాబట్టి మనం అది పనిచేస్తుంది అని గ్రహించలేం. అయితే ఇక్కడ శ్రీ యంత్రం వంటివి ఆరాధిస్తే మెల్లి మెల్లిగా క్రమేపి మీకు ఫలితం కనబడినా ఇవి ఆధ్యాత్మిక వస్తువులు కాబట్టి గ్యారంటీ అనేది ఏ జ్యోతిష్యులు ఇవ్వలేరు అని గుర్తుపెట్టుకోండి. ఏ పనిచేసినా నమ్మకంతో నే చేయాలి. యంత్రాన్ని సాధకుడు తప్పు చేస్తే ఆ ఫలితం కూడా అలానే ఉంటుంది.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×