E-Paper
Advertisement

Telangana Congress: టీపీసీసీ చీఫ్‌కు కొత్త బాధ్యతలు? గాంధీభవన్‌లో రాజకీయ చర్చలు

Telangana Congress: టీపీసీసీ చీఫ్‌కు కొత్త బాధ్యతలు? గాంధీభవన్‌లో రాజకీయ చర్చలు
Advertisement

Telangana Congress:  స్వేచ్ఛ, బ్యూరో: టీపీసీసీ చీఫ్​ కు కొత్త పదవి వరించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ లో చిలుకూరు శ్రీనివాస్ మూర్తి పంచాంగం చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆయన నాయకత్వ అడుగులను బలపర్చాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఈ ఏడాది రాజకీయ, సామాజిక ఆర్ధిక పరిస్థితులు ప్రభావితం చూపుతాయన్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే సమయంలో దేశంలోనూ ఆ అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. సామాజికంగా కొన్ని ఆందోళకర పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలూ పెరిగే ఛాన్స్ ఉన్నదన్నారు. అయితే ప్రభుత్వ పాలన పరంగా సీఎం రేవంత్ కు కానీ, పార్టీ ని ముందుకు నడపడంతో పీసీసీ చీఫ్​ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కొత్త చట్టాల అమలుతో పాత చట్టాలకు ముగింపు పలికే ఛాన్స్ ఉన్నదన్నారు. వ్యవసాయ రంగంలో అనుకూలంగా ఉంటుందన్నారు. వాణిజ్య పంటలు సమృద్దిగా పండుతాయన్నారు. పండిన పంటకు మంచి మద్ధతు ధర లభించే ఛాన్స్ కూడా ఉన్నదన్నారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి ఇంటిముందు అన్నదమ్ముల రచ్చ.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. రోహిణి ప్లాన్ అట్టర్ ప్లాప్..

హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి

Advertisement

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్​ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలకు అన్ని రంగాలలో మేలు జరగాలని కోరుకున్నారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండేలా భగవంతులు ఆశీస్సులు ఉండాలన్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల.మద్దతు తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పదేళ్ల వరకు పవర్ ను కాపాడుకోవాలన్నారు. ఏఐసీసీ నాయకులు ఖర్గే , సోనియాగాంధీ గారు రాహుల్ గాంధీ కృషితో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు అండతో సక్సెస్ పుల్ గా ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో ఎవరు ఎవర్ని పరాభవం చేయకుండా అంత కలిసి కట్టుగా సుఖ శాంతులతో ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు.ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విదంగా అర్హులైన వారి లబ్ది పొందే విదంగా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు.

అభివృద్ధికి కొత్త దిశ

మంత్రి వివేక్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ దఫా బడ్జెట్ రూపొందించబడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీ విధానంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని విమర్శించారు. సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిన పరిస్థితుల్లో కూడా, ప్రజల ఆమోదంతో కూడిన బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను “రెవల్యూషనరీ బడ్జెట్” గా అభివర్ణిస్తూ, ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని మంత్రి పేర్కొన్నారు.

మూడు లక్షల కోట్ల వరకు వడ్డీలు

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు సంవత్సరాల్లోనే అప్పులపై సుమారు మూడు లక్షల కోట్ల వరకు వడ్డీలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ, ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతులకు రుణమాఫీ మరియు రైతు భరోసా వంటి కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డుల జారీ ద్వారా అర్హులైన వారికి మద్దతు అందిస్తున్నామని తెలిపారు.ప్రజాపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపొందించబడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.

Also Read: PM Netanyahu: రకరకాల వార్తలు.. నేనే బతికే ఉన్నా.. మీడియా ముందుకు ఇజ్రాయెల్ పీఎం.. ఇరాన్ ఆ ఛాన్స్ లేదు

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×