E-Paper
Advertisement

Turmeric :- పసుపు ప్రసాదాన్ని ఏం చేయాలి…?

Turmeric :- పసుపు ప్రసాదాన్ని ఏం చేయాలి…?
Advertisement

Turmeric :- వేల ఏళ్ల చరిత్ర ఉన్న పసుపుకి హిందూమతంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజ పునస్కారాల్లో పసుపు లేని పూజ ఉండదు. పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరగవు. అంతటి ప్రాధాన్యం కేవలం పసుపుకి ఉంది. వివాహితలకు పసుపుకి విడదీయరాని బంధం ఉంది. దేవీ ఆలయాల్లో, నవరాత్రి ఉత్సవాల పూజల వేళల్లోను పసుపుతో చేసే అలంకారాలు చేస్తుంటారు.

Advertisement

గోదాదేవి లేదా అమ్మవారి దేవాలయాలకి వెళ్లినప్పుడు మహిళలకు పసుపు ప్రసాదాన్ని అందిస్తారు . అలాంటిటప్పుడు ఆ పసుపును ప్రసాదంగా తీసుకొచ్చినప్పుడు పూజ గదిలో నిత్యం పూజిస్తే ఇంటికి సర్వదా క్షేమకరం.. నిత్యం ఈ పసుపుతో పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. అలాంటి వారికి వాహన యోగం ప్రాప్తిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ సమకూరుతాయి. ఇళ్లంతా నిత్యం సంతోషాలతో నిండి ఉంటుంది.

గృహ దేవతను పసుపు నీళ్లతో శుభ్రం చేస్తే దైవ కళ పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ షాపుల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి గల్లాపెట్టెలో పెడితే బిజినెస్ మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రపంచం వాడుకునే పసుపు వాటాలో 80శాతం మనదేశానిదే. పసుపు వినియోగం, ఉత్పత్తిలోను భారతదేశానిదే పైచేయి. ఆయుర్వేద , యునాని వైద్యాల్లోను పసుపును ఉపయోగిస్తారు.

Advertisement

రోజు స్నానం చేసేటప్పుడు పసుపును నీటిలో వేసుకుంటే దేహ కాంతి మెరుగుపడుతుంది. చర్మరోగాలు దూరుమవుతాయి.పెళ్లిళ్లసమయంలో పసుపుతోనే మంగళ స్నానం చేయిస్తంటారు. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే పెళ్లి కాని అమ్మాయిలకు వివాహ దోషాలు తొలగి కళ్యాణ ఘడియలు వస్తాయి. శ్రీదేవి అమ్మవారికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం దైవ దోషాల నుంచి బయటపడతారు..

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×