BigTV English
Advertisement

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…


IPL : ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపై ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్ కతా జట్టులో కెప్టెన్ నితీశ్ రాణా (42), రింకూ సింగ్ (46) రాణించారు.

హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ , నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, మార్ క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు.


172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. కెప్టెన్ మార్ క్రమ్ (41), హెన్రిచ్ క్లాసెన్ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేసింది.

హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్ లో 9 పరుగులు మాత్రమే చేయాలి. కానీ 3 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడోతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లలో శార్ధుల్ ఠాకూర్, వైభవ్ ఆరోరా రెండేసి వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్ ను అద్భుతంగా వేసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

Shreyas Iyer: పాపం శ్రేయాస్‌ అయ్య‌ర్‌.. టీమిండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ

Harmanpreet Kaur: బికినీలో టీమిండియా కెప్టెన్‌..ఆమెతోనే స‌హ‌జీవ‌నం అంటూ ట్రోలింగ్ ?

Sanju Samson: సంజు పుట్టిన రోజు..అగ్గిరాజేసిన CSK ట్వీట్‌..అత‌ని వ‌ల్ల జ‌ట్టుకు ఉప‌యోగం ఏంటంటే

Richa Ghosh: మమతా అంటే మాములుగా ఉండ‌దు..రిచా ఘోష్ పేరుతో స్టేడియం, డీఎస్పీ ప‌ద‌వి

Shreyas Iyer: మ‌గాడంటే వాడే, శ్రేయాస్ అయ్య‌ర్ కు పెళ్లాన్ని అయిపోతా..హీరోయిన్ సంచ‌ల‌నం !

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Big Stories

×