Vaisakha Purnima : బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణమి రోజు జన్మించాడని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 563లో వైశాఖ పూర్ణిమ రోజున శాక్య రాజ్యంలో లుంబినీలో జరిగింది. బౌద్ధమతాన్ని నమ్మేవారు బుద్ధి పూర్ణమి కోసం ఎదురుచూస్తుంటారు. బుద్ధ భగవానుడు చూపిన మార్గాలు ఆచరణీయం, ఆదర్శప్రాయం.
.ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ రోజు, సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవిస్తోంది. అందుకే ఈసారి వైశాఖ పూర్ణమి చాలా ముఖ్యమైనది. బుద్ధ పూర్ణిమ తేదీ పౌర్ణమి మే 4 రాత్రి 11:44 గంటలకు ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు ఉపవాసం పాటించాలనుకునే వారు ఈ నెల 5న పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
ప్రతి నెల పౌర్ణమికి ఒక ప్రత్యేక ఉంది. పరిమాణంలో చంద్రుడు పెద్దగా దర్శనమిచ్చే రోజు పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తే ఇంటి యజమానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకి విశిష్టత ఉంది. వైశాఖ పూర్ణమి రోజు చేసే దానాలకు రెట్టింపు ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది.
పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసిన చంద్రుడితోపాటు లక్ష్మిని పూజించాలి. పూజా స్థలంలో లక్ష్మి దేవి ప్రతిమకి పూలు సమర్పించి దూప దీపాలను సమర్పించి హారతి ఇవ్వాలి. ప్రసాదాన్ని ఇంట్లో వారందరికి పంచాలి. కుండలో నీళ్లు పోసి ఆ నీటిని చంద్రుడితో పూజించాలి. చంద్ర దేవుని హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాన్ని తీసుకోవాలి.
వైశాఖ పౌర్ణమి నాడు పేదలకి దానం చేసిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుంటే రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం విశేషమైన ఫలితాల్ని ఇస్తుంది. పౌర్ణమి తిథి నాడే కూర్మావతారంలో మహావిష్ణువు భూమండలాన్ని రక్షించాడని కూర్మ పురాణం చెబుతోంది.