E-Paper
Advertisement

Unnao Rape Case: ఉన్నావ్ రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం షాక్.. జైలుకే పరిమితం!

Unnao Rape Case: ఉన్నావ్ రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం షాక్.. జైలుకే పరిమితం!
Advertisement

Unnao Rape Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 నాటి ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన శిక్ష అమలును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే (Stay) విధించింది.

ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగార్‌కు కింది కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, ఇటీవల ఈ కేసులో సెంగార్ శిక్షను నిలిపివేస్తూ (Suspension of Sentence) ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఆయనకు ఊరట లభించే అవకాశం ఏర్పడింది. అయితే, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బాధితురాలి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో కుల్దీప్ సెంగార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా తమకు కౌంటర్ దాఖలు చేయాలని కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం కుల్దీప్ సెంగార్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఆయన మరికొంత కాలం జైల్లోనే ఉండక తప్పదు. 2017లో మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై బాధితురాలి కుటుంబంపై దాడులకు పాల్పడిన అభియోగాలపై సెంగార్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Read Also: Naa Anveshana : నా అన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. అరెస్ట్ చెయ్యాలని డిమాండ్..

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×