BigTV English

Vastu :- ఇంటి గదులు ఇరుగ్గా ఉండకూడదా…

Vastu :- ఇంటి గదులు ఇరుగ్గా ఉండకూడదా…




Vastu :- చైనీయులు ఫెంగ్ షూయ్ ను బాగా నమ్ముతుంటారు. ఎంత ప్రయత్నించినా ఆదాయం పెరగడం లేదని భావించే వారు ఇంట్లో కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి కుదుటపడుతుందని ఫెంగ్ షూయ్ చెబుతోంది.


ఈశాన్య దిక్కులో కాక్టస్‌ వంటి మొక్కులు ఉంటే వెంటనే తీసేయాలంటోంది. ఇలాంటి మొక్కలు అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారతాయి. వీలైతే ఇంట్లో ఒక చిన్న అక్వేరియంను లేకుంటే విండ్‌ చైమ్స్‌ను పెట్టుకుంటే మంచిదట…

ఇల్లు ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే ఒక పద్దతి ప్రకారం సామాన్లు సర్దుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోకి ప్రవేశించ మార్గం చెత్త చెదారం లాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. సామాన్లు కిక్కిరిసినట్టుగా ఉంచుకోకూడదు. లోపలకి ప్రవేశించే దారి విశాలంగా ఉన్నప్పుడే ప్రాణశక్తి లోపలకి వస్తుంది.


గాలి, వెలుతురూ కూడా ధారాళంగా వచ్చేలా చూసుకవాలి. ప్రధాన గుమ్మం ఎదుట అద్దం లాంటివి అసలు పెట్టకూడదు. ఇది ఇంట్లోని పాజిటివ్ ను బయటికి పంపుతుందని ఫెంగ్ షూయ్ చెబుతోంది.

ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉంటే ఆ గదికి వేసే రంగులు లేత రంగులలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వేసే కార్పెట్ కలర్ కూడా ముఖ్యమే. ఇంటి రంగుల్ని బట్టి మాత్రమే కార్పెట్ కలర్ ఉండాలి. ఉండే ఇల్లు ఫేసింగ్ బట్టి రంగును ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ విషయంలో అవసరమైతే ఫెంగ్‌షూయ్‌ నిపుణులను నుంచి సలహాలు తీసుకోవచ్చు.

ఫెంగ్‌షూయ్‌ నమ్మినా నమ్మకపోయినా మన పెద్దలు ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి అసలైన కారణం కూడా ఇదే. ఇంట్లో ఎప్పటికప్పుడు చెత్త చేదారాన్ని , పనికి రావాని వస్తువుల్ని ఇంట్లో ఉంచదనడానికి మూల సూత్రం ఇదే కావచ్చు.

చెత్త వస్తువులతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. అందుకే వాటిని వదిలించుకోవాలి. ఇంటినిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×