BigTV English

Wearing colored clothes will change your life : రంగు వెలిసిన బట్టలు వేసుకుంటే లైఫ్ తిరగబడుతుందా…

Wearing  colored clothes will change your life : రంగు వెలిసిన బట్టలు వేసుకుంటే లైఫ్ తిరగబడుతుందా…


Wearing colored clothes will change your life : ముందు జీర్ణావస్థలో ఉన్న బట్టల్ని వేసుకోకూడదు. రోజూ కొత్తగా ఉండే బట్టల్ని వేసుకోవాలి. అంటే రోజుకో కొత్త జత కొనుక్కుని వేసుకోడం కాదు. ధనవంతులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా జీర్ణావస్థలో ఉన్న బట్టల్ని వేసుకోరు. చూడటానికి కొత్త బట్టలు మాదిరిగానే కనిపిస్తాయి. ఏ బట్టలైనా సరే అందులో కొత్తదనం ఉండే వరకు వాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఒక జత కుట్టించుకున్నామని చెప్పి సంవత్సరాల కొద్దీ వాడాల్సిన పనిలేదు. కొంతమంది పట్టు వస్త్రాలను అరుదుగా వాడుతుంటారు. కొన్ని రకాల బటల్ని నిత్యం వాడుతుంటారు. రెగ్యూలర్ గా వాడే బట్టలు కొత్తదనం ఉండే వరకు మాత్రమే వాడాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

రెగ్యూలర్ వేసుకునే బట్టలు ఆరు నెలలు లేదా ఏడాదిలో కొత్తదనం పోతుంది. వారానికి ఒకసారి ఒక జత వాడితే ఏడాది 54 సార్లు వేసుకున్నట్టే. కొంతమంది బాగున్న బట్టల్నే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. వారానికి రెండు సార్లు అవే వాడతారు. అందువల్ల అవి త్వరగా పాడైపోతాయి. కొత్తదనం పోతుంది. మీకు గొప్ప ఆశయాలు ఉండి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకుంటే ఉత్సాహం కలగాలంటే ఇవన్నీ పాటించాలి. లేదు జీవితం మాములుగా గడిచిపోతే చాలు అనుకుంటే ఇవన్నీ పాటించాలిసిన అవసరం లేదు. పూర్వం రోజుల్లో మునులు కూడా బాగా చీకిపోయిన బట్టల్ని ఒంటిపై వాడేవారు కాదు. ఒక్క చిరుగు కనిపించినా పక్కన పాడేసే వారు. వాళ్లు ధరించే బట్టలు కూడా తొందరగా పోతూ ఉండేవి. మనం ఇవాళ్టి రోజుల్లో ఒక జత కుట్టించుకుంటే ఆరునెలైనా పాడవు. కానీ మునులు వేసే బట్టలు త్వరగా చిరిగిపోయేవి. పైగా వారికి ఎక్కువ జతలు కూడా ఉండేవి కాదు.


సంసార జీవితంలో ఉండే వాళ్లు ధనాన్ని బాగా సంపాదాలనుకునే వాళ్లు, గొప్ప స్థానాలకు ఎదగాలనుకునే వాళ్లు, పాత బట్టలు వేసుకోవడం మానేయాలి. పాతబట్టల్లో కరుకుదనం పోనంత వరకు వాడొచ్చు.. ముఖ్యంగా వేసుకునే బట్ట కలర్ వెలిసిపోయి ఉండకూడదు. బట్ట పూర్తిగా మెత్తబడిపోకూడదు. పాతవి పోయినప్పుడుల్లా కొత్తవి తీసుకుంటే మార్చుకుంటూ ఉండాలి. మీరు వేసుకుని పడేసే బట్టలు ఓల్డ్ ఏజ్ హోమ్ వాటికి కూడా ఇవ్వకూడదు. అలాగని చెత్తకుప్పల్లోను పాడేయకూడదు . మనం బట్టలు పడేసినా అందులో కొంతకాలం మనం వైబ్రేషన్స్ ఉండిపోతాయి. వాటిని ఎవరైనా వేసుకునే ఆ ప్రభావం మన మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. పూర్వం రోజుల్లో పాతబట్టల్నీ అగ్ని గుండంలో వేసే వాళ్లు. ఇప్పుడు అలాంటివి ఇళ్లల్లో లేవు కాబట్టి ఒక పని చేయాలి. మీరు పడేద్దామనుకున్న బట్టలు ఒక మూట కట్టి కొంతకాలం ఇంట్లో ఉంచండి. వాటిని మళ్లీ వేసుకో కూడదు. కొంతకాలం గడిచిన తర్వాత వాటిని మీరు ఎక్కడైనా పడేసినా పర్వలేదు. నీటి ప్రవాహం ఉన్న చోట పడేసినా పర్వాలేదు. మనం బయట పడేసే బట్టలు పని వాళ్లకు కూడా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. బట్టలు పడేసేటప్పుడు కూడా నీళ్లల్లో తడిపి పారేయాలి.

Fallow this link for more latest updates :-Bigtv

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×