BigTV English

Can We Keep 3 Burner Stove In HOME ??? : ఇంట్లో మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ పెట్టుకోకూడదా

Can We Keep 3 Burner Stove In HOME ??? : ఇంట్లో మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ పెట్టుకోకూడదా

Can We Keep 3 Burner Stove In HOME : ఒకే ఇంట్లో మూడు పొయ్యలు పెట్టుకూడదనే మాట వెనుక పరమార్థం ఉంది. అన్నదమ్ములు విడిపోకుండా ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్న అన్నా, తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు, వేర్వేరుగా వంట చేసుకోవద్దని చెప్పడమే ఉద్దేశం. విరోధాలు పెట్టుకోకుండా కలిసి ఉండాలని చెప్పడమే ఈమాట వెనుక ఉద్దేశం. కుటుంబాలు విడిపోకుండా కలిసి మెలిసి ఉండాలని మన పెద్దోళ్లు అలా చెప్పారు. కొందరి ఇళ్లల్లో ఒకే ఇంట్లోనే వంటిల్లులో మూడు పొయ్యలు వెలిగిస్తుంటారు. ఒకరి చేసిన వంట మరొకరు ముట్టరు. అలా ఇంట్లో ఉండటం ఎందుకన్న ప్రశ్న వస్తుంది.శరీరాలు ఒకే ఇంట్లో ఉండి మనసులు వేర్వరుగా ఉంటే అది కుటుంబం కాదు. అది సమైక్య కుటుంబం కాదు . ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అన్యోన్యంగా అనురాగాలతో ఉండాలి. ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం చాలా కష్టమైన విషయం. ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలకు మారిపోయాయి. అమ్మా,నాన్న,బిడ్డ అంటే ఈరోజుల్లో కుటుంబమంటే.


మూడు పొయ్యలు వద్దన్న ఉమ్మడి కుటుంబాలు కాపాడటానికి పెట్టిన మాట. ఇప్పుడు సౌకర్యం కోసం ఇంట్లో మూడు , నాలుగు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ లు వచ్చేశాయి. వాటిని వద్దని అనడంలో ఎలాంటి లాజిక్ కు లేదు. బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనానికి అన్నీ ఒకేసారి పెట్టుకోవడానికి ఈ మూడు బర్నర్ లు ఉన్న స్టవ్ లు అవసరమవుతాయి. వాటిని ఇంట్లో పెట్టుకోవడంలో తప్పులేదు. మూడు పొయ్యలు అంటే మూడు బర్నర్ లు కాదన్న సంగతి గ్రహించాలి. అభిప్రాయాలు కలవకుండా సయోధ్య లేకుండా ఉండే పరిస్థితి కోసం మూడు పొయ్యలు అనే మాటకి అర్ధం. మూడు విడివిడి వంటలు ఒక ఇంట్లో వద్దని మాత్రమే మన పెద్దోళ్లు చెప్పిన మాట.

ఎవరో ఎప్పుడో ఆదర్శపాయమైన కుటుంబాలు ఉన్న రోజుల్లో చెప్పిన ఇలాంటి మాటలు నేటికి వర్తించవు. నాటి పరిస్థితులకు చెప్పిన మాటల్ని న్యూక్లియర్ ఫ్యామిలలు ఉన్న ఈ రోజులుకి అన్వయించుకోవడం అంటే బట్టతలకి బోడి గుండుకి ముడిపెట్టుకున్నట్టే.


follow this link for more updates :- Bigtv

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×