BigTV English

Musk : ఓవైపు కోతలు, మరోవైపు బుజ్జగింపులు.. ఈ మస్క్‌కు ఏమైంది?

Musk : ఓవైపు కోతలు, మరోవైపు బుజ్జగింపులు.. ఈ మస్క్‌కు ఏమైంది?

Musk : ఎలాన్ మస్క్ ప్రవర్తన, విచిత్ర నిర్ణయాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చిన కొన్ని గంటల్లోనే… మళ్లీ వాళ్లను బతిమాలుతాడు. తీసేసిన ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు రావాలంటూ కాళ్లా వేళ్లా పడతాడు. అంతలోనే మరికొందర్ని తీసేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో… అసలు మస్క్‌కు ఏమైందోనని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


ట్విట్టర్లోని వివిధ విభాగాల నుంచి ఇప్పటికే దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ మస్క్ మరికొందరు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతువున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా విభాగాల అధిపతులు అంగీకారం తెలపాలంటూ మస్క్‌ లేఖ రాశాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే… సేల్స్‌ డివిజన్ హెడ్ రాబిన్‌ వీలర్‌, పార్ట్‌నర్‌షిప్స్‌ డివిజన్ హెడ్ మ్యాగీ సునీవిక్‌… మస్క్‌ ప్రతిపాదనను తిరస్కరించారని అంటోంది. దాంతో… వాళ్లిద్దర్నీ మస్క్‌ ఉద్యోగం నుంచి పీకేశాడని ట్విట్టర్ నుంచే వార్త లీకైంది. రాబిన్ వీలర్‌ అక్టోబర్లోనే కంపెనీ వీడాలని భావించినా… మస్క్ ఆమెను బుజ్జగించి ట్విట్టర్లో కొనసాగేలా ఒప్పించాడని ప్రచారం జరిగింది. మస్క్ నిర్ణయాలతో విసిగిపోయిన ప్రకటనదారులతో మాట్లాడే విషయంలో… మస్క్‌కు రాబిన్ వీలరే సహకరించిందని చెబుతారు. అలాంటి వీలర్ విషయంలోనూ మస్క్ నిర్దయగా వ్యవహరించాడని అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

కష్టపడి పనిచేస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేదంటే కంపెనీ నుంచి వెళ్లిపోవాలని ఇటీవల మస్క్ ఒత్తిడి చేయడంతో… దాదాపు 1200 మంది ఉద్యోగులు కంపెనీని వీడి వెళ్లిపోయారు. వీరితో కలిపి ట్విట్టర్ నుంచి తీసేసిన పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 వేలకు చేరింది. అయినా మరికొందర్ని తొలగిస్తానంటూ మస్క్ ఉద్యోగుల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడాయన కన్ను సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలపై పడిందని… ఏ క్షణమైనా ఆయా విభాగాల సిబ్బందిపై వేటు పడొచ్చని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాంతో… అసలు ఈ మస్క్‌కు ఏమైందని అంతా చర్చించుకుంటున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×