BigTV English

Birds Fly : పక్షులు ‘V’ ఆకారంలో ఎందుకు ఎగురుతాయో తెలుసా..?

Birds Flying : ఆకాశంలో పక్షులు ఎగరడం చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. మనకు రెక్కలు ఉంటే ఎంచక్కా వాటితో ఎగిరిపోవచ్చు అని అనుకుంటాం.అయితే కొన్ని రకాల పక్షులు ఎక్కువగా భూమి పై సంచరిస్తూ ఉంటాయి. మరికొన్ని అడవిలో జీవిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు మాత్రం దూర ప్రదేశాలకు వలసగా వెళ్తుంటాయి.

Birds Fly : పక్షులు ‘V’ ఆకారంలో ఎందుకు ఎగురుతాయో తెలుసా..?

Birds Fly : ఆకాశంలో పక్షులు ఎగరడం చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. మనకు రెక్కలు ఉంటే ఎంచక్కా వాటితో ఎగిరిపోవచ్చు అని అనుకుంటాం. అయితే కొన్ని రకాల పక్షులు ఎక్కువగా భూమిపై సంచరిస్తూ ఉంటాయి. మరికొన్ని అడవిలో జీవిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు మాత్రం దూర ప్రదేశాలకు వలసగా వెళ్తుంటాయి.


ఇలా దూర ప్రాంతాలకు వెళ్లే పక్షులను చూసినట్లయితే కొన్ని రోజుల పాటు ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఇలా వెళ్లేవి గుంపుగుంపులుగా వెళ్తాయి. ఇలాంటి సమయంలో అవి ‘V’ ఆకారంలో వెళ్తాయి. అవి అలా ఎందుకు వెళ్తాయో మీకు తెలుసా..? అలా ఎగరడం వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం.

ఏరోడైనమిక్స్


‘V’ ఆకారం అనేది ఏరోడైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ v ఆకారంలో ఎగరడం వల్ల పక్షులు సమర్థవంతంగా మందుకు కదులుతాయి. పక్షులు వాటి రెక్కలను తెరచినప్పుడు దాని వెనకు సుడిగుండాన్ని సృష్టిస్తుంది. ఈ సుడిగుండం పక్షి ఎత్తులో ఎగరడానికి ముందుకు వేగంగా సాగడానికి సహాయపడుతుంది. దాని వెనుక అదే మార్గంలో మరో పక్షి వస్తున్నప్పుడు ఈ సుడిగుండం వెనక వచ్చే పక్షిపై పడి ఎగరడానికి మరింత శక్తిని ఖర్చు చేస్తుంది.

కమ్యూనికేషన్

‘V’ ఆకారంలో పక్షులు ఎగరడానికి మరొక కారణం కమ్యూనికేషన్. ఈ ఆకారంలో పక్షులు ఎగరడం వల్ల ఒకదానికొకటి సులభంగా చూసుకోగలవు. దూర ప్రాంతాలకు గుంపులుగా వెళ్లేప్పుడు ఈ పద్ధతిని ముఖ్యంగా పాటిస్తాయి.

నాయకత్వం

‘V’ ఆకారంలో ఎగిరేప్పుడు మందున్న పక్షి ఆ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. తన గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని గుంపును జాగ్రత్తగా గమ్యానికి చేరుస్తుంది. అలాంటి అనుభవం ఉన్న పక్షి ‘V’ ఆకారంలో ముందుంటూ నాయకత్వం వహిస్తుంది.

భద్రత

‘V’ ఆకారంలో పక్షులు ఎగరడం వల్ల అవి సురక్షితంగా ముందుకు సాగుతాయి. ‘V’ ఆకారంలో ఉన్న పక్షులు అన్ని వైపుల గమనించగలవు. వేటాడే జంతువులను మందుగానే గుర్తిస్తాయి. ఈ ఆకారంలో ఎగిరేప్పుడు ఎదైనా పక్షి ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే ఇతర పక్షులు సాయం చేస్తాయి.

శక్తి వినియోగం

‘V’ ఆకారంలో పక్షులు ఎగురుతున్నప్పుడు గాలిని చీల్చుకుంటూ మందుకు సాగుతాయి. ఈ ఏరోడైనమిక్ సూత్రం వల్ల పక్షులు ఎగిరేందుకు తక్కువ శక్తి ఖర్చవుతుంది. ఈ పద్ధతి పక్షులకు పుట్టుకతోనే సంక్రమించదు. గుంపులో ఉంటూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఇతర పక్షుల నుంచి నేర్చుకుంటాయి.

సమానత

‘V’ ఆకారంలో పక్షులు ఎగిరేటప్పుడు పక్షుల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. నాయకత్వ స్థానంలో ఉన్న పక్షిని మాత్రమే అనుసరిస్తాయి. ఆ స్థానం గురంచి పక్షుల్లో ఎటువంటి పోటీ ఉండదు. గుంపులోని పక్షులన్నీ సమానత్వాన్ని పాటిస్తాయి. ఇలా అన్ని పక్షులు కలిసి గమ్య స్థానానికి చేరుతాయి.వలసగా వెళ్లిన పక్షులు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత మరో ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. దూర ప్రాంతాలకు వలసగా వెళ్లే పక్షులు మాత్రమే ‘V’ ఆకారంలో వెళ్తాయి.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×