Big Stories

Significance Of Offering Coconut : దేవుడికి కొబ్బరి కాయే ఎందుకు కొట్టాలి?

Significance Of Offering Coconut : మన పురాణాలు – ముఖ్యం గా ఉపనిషత్తులు, వేద వాజ్ణ్మయం అంతా కూడా సమస్త మానవాళిని ఉద్దేశించినవి. హిందువుల కోసం మాత్రమే కాదు. పూజ దేవుడి కోసం కాదు. పూజ మీ కోసం. మీ ప్రాంతంలో దొరికే వస్తువులతో – ఆరోగ్యాన్ని కలిగించే వస్తువులతో పూజ చేస్తారు.

- Advertisement -

కొబ్బరికాయ కొట్టమని ఏ దేవుడు చెప్పలేదు. నిజానికి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అందుకనే మన పూర్వీకులు ఇలాంటి కొన్ని మంచి సంప్రదాయాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు.

- Advertisement -

ఉదయం స్నానం చేసి పరకడుపుతో దైవదర్శానికి వెళ్లడం జరుగుతుంది .అలా వెళ్ళిన వారికి కొన్ని సందర్భాల్లో దర్శనం లేక కొన్ని సేవలు జరిపే సమయంలో కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి సందర్భాల్లో కొంతమందికి ఏమీ తినక పోవడం వల్ల నిస్సతువ ఏర్పడే అవకాశం ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు తక్షణ శక్తి దాయని గా ఉపయోగ పడుతాయి, ప్రసాదంగా కొబ్బరిని తినడం వల్ల పుజానంతరం ఇంటికి చేరే వరకు అది శక్తి ఇవ్వటం జరుగుతుంది

దక్షిణాదిన కొబ్బరి పంట ఎక్కువ – ఉత్తరాదిన దొరకవు. అక్కడ పూజలో వాడకం తక్కువ. అయితే పరిణామ క్రమంలో కొన్ని అలవాట్లు చాలా తరాలుగా కొనసాగి సంప్రదాయంగా మిగులుతాయి. అన్నీ అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలం సరిపోదు . అందరి మేధస్సుకు అందేది కాదు. సంప్రదాయాన్ని పాటించడం పద్ధతి. పద్ధతి ఉన్నవాళ్లకు – పెద్దలు చెప్పింది చాలు.

హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి. లా టెంకాయను పగులకొడితే.. మనుషుల అహం, తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News