Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ప్రతీ రోజు యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ రన్నింగ్ చేశారు. ఈ రన్నింగ్ లో రేవంత్ వెనకబడ్డారు. రాహుల్, రేవంత్ కలసి పరుగు తీసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. గతంలో కర్నాటకలో కూడా మాజీ సీఎం సిద్దారామయ్యతో కూడా రాహుల్ పరుగు తీశారు.
ఈరోజు ఉదయం జడ్చర్లలోని గొల్లపల్లి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. రాహుల్‌తో కలిసి నడవడానికి యువత, పిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాజాపూర్ నుంచి పెద్దాయపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయం వరకు యాత్ర కొనసాగింది.