BigTV English

Flying Car : మొట్టమొదటి ఫ్లయింగ్ కారు.. ప్రీ ఆర్డర్లకు సిద్ధం..

Flying Car : మొట్టమొదటి ఫ్లయింగ్ కారు.. ప్రీ ఆర్డర్లకు సిద్ధం..
flying car


Flying Car : ఒకప్పుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే కాళ్లకు పనిచెప్పేవారు. కానీ మెల్లగా వాహనాలపై ఆధారపడడం మొదలుపెట్టారు. అప్పటి ఎడ్ల బండ్ల దగ్గర నుండి ఇప్పటి ఎలక్ట్రిక్ కార్ల వరకు ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎన్నో విధాలుగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఏకంగా గాలిలో ఎగిరే కారు అందుబాటులోకి వచ్చేసింది. సక్సెస్‌ఫుల్‌గా మొదటి ఫ్లయింగ్ కారు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేస్తుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కారు సిద్ధమయ్యింది. దీని ఖరీదు 2,99,999 డాలర్లు. తాజాగా మొదటి ఫ్లయింగ్ కారును తయారు చేసిన ఎలెఫ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. అమెరికన్ ప్రభుత్వం నుండి తమ ఫ్లయింగ్ కారుకు అప్రూవల్ వచ్చిందని ప్రకటించింది. ఫ్లయింగ్ కార్లు కేవలం ఫిక్షనల్ అనుకుంటున్న సమయంలో వీటిని నిజం చేసిన మొదటి సంస్థ ఎలెఫ్ ఎలక్ట్రానిక్స్. ఈ ఫ్లయింగ్ కారు అనేది ఏరోనాటిక్స్, గ్రీన్ ఎనర్జీ కలిపిన సాధనం అని నిపుణులు ప్రశంసిస్తున్నారు.


ఎలెఫ్ ఫ్లయింగ్ కారు అనేది ప్రపంచంలోనే మొదటి మోడల్ ఏకు సంబంధించింది మాత్రమే కాకుండా ఇది పూర్తిగా కరెంటు ఆధారంగా నడుస్తుందని కంపెనీ ప్రకటించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంత మెరుగుపడిందో చెప్పడానికి ఈ ఫ్లయింగ్ కారు ఒక ఉదాహరణగా మారింది. ఈ ఫ్లయింగ్ కారు గురించి వింటున్న చాలామంది ఫ్లయింగ్ వాహనాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని నిపుణులు భావిస్తారు. అంతే కాకుండా చాలామందికి దీని ద్వారా ఏరోనాటిక్స్‌పై కూడా ఆసక్తి కలుగుతుందన్నారు.

ఎలెఫ్ ఎలక్ట్రానిక్స్ అనేది మొదటి ఫ్లయింగ్ కార్లను తయారు చేసి ప్రీ ఆర్డర్లకు సిద్ధంగా ఉంది. అయితే ఈ కంపెనీని చూసి మరికొన్ని ఆటోమొబైల్ సంస్థలు కూడా ఫ్లయింగ్ కార్ల తయారీలో భాగం కానున్నాయి. ఇప్పటికే హ్యుండాయ్.. ఇండోనేషియాలో తమ మొదటి ఫ్లయింగ్ కార్లను తయారు చేస్తామని బయటపెట్టింది. ఇక ఈ ఎలెఫ్ ఫ్లయింగ్ కార్లను దక్కించుకోవాలంటే ముందుగా 1500 డాలర్లు ప్రీ బుకింగ్ ఫీజ్ కట్టాలని సంస్థ వెల్లడించింది. కానీ ఇంకా రిలీజ్ డేట్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చాలామంది ఈ ఫ్లయింగ్ కార్లలో ఎగరాలనుకుంటున్న కస్టమర్లు ప్రీ ఆర్డర్లకు సిద్ధంగా ఉన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×