BigTV English

Sitara makes Mahesh Proud : ఏ స్టార్ కిడ్‌కు అందని ఘనతను దక్కించుకున్న సితార.

Sitara makes Mahesh Proud : ఏ స్టార్ కిడ్‌కు అందని ఘనతను దక్కించుకున్న సితార.
Sitara


Sitara makes Mahesh Proud : ఫ్యాన్స్ అనేవారు తమ అభిమాన హీరోలను, హీరోయిన్లను ఎంతగా ఇష్టపడతారో.. వారి కుటుంబాలను కూడా అంతే ఇష్టపడతారు, గౌరవిస్తారు. అందుకే స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. వారిని పాపులర్ చేసేస్తారు. స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలాగే మహేశ్ బాబు కుమార్తె సితారపై కూడా అలాంటి ఫోకసే ఉంది. తాజాగా సితార సాధించిన ఘన విజయాన్ని మహేశ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.

మహేశ్ బాబు, నమ్రత కూతురు సితార వయసు ప్రస్తుతం 11 ఏళ్లే. అయినా కూడా సోషల్ మీడియాలోనే కాదు.. సినీ పరిశ్రమలో కూడా తనపై చాలా అటెన్షన్‌ను సంపాదించుకుంది. తనే సొంతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా డ్యాన్స్ వీడియోలతో మహేశ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా పలు యాడ్స్‌లో కూడా కనిపించింది. తాజాగా అలాంటి ఒక యాడ్.. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద విడుదయ్యింది. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్‌కు కూడా తాము చేసిన వర్క్.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఫీచర్ అవ్వలేదు.


సితార ఇప్పటికే తన అందంతో, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా తన తండ్రితో కలిసి పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఎక్కువగా ఫ్యాన్స్‌కు కనిపిస్తోంది. దీంతో సితారకు కూడా ప్రత్యేకంగా అభిమానులు పెరిగిపోయారు. వారంతా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర తన యాడ్ ఫీచర్ అవ్వడం చూసి సంతోషపడుతున్నారు. అంతే కాకుండా తల్లిదండ్రులుగా చాలా గర్వపడుతున్నామంటూ మహేశ్, నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని బయటపెట్టారు.

‘టైమ్స్ స్క్వేర్‌ను వెలిగిస్తోంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పటాకా. ఇలాగే వెలిగిపోతూ ఉండు. ’ అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక నమత్ర కూడా ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌పై ఎవరు డెబ్యూ చేశారో చూడండి. నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. నీ కలలు నిజం కావడం చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది సితార. నువ్వు ఇలాగే వెలుగుతూ ఉండాలి సూపర్‌స్టార్’ అని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ కూడా సితారను చూసి గర్వపడుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×