Lack Of Sleep: ఆరోగ్యకరమైన శరీరం కోసం.. పోషకాహారం తినడం ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే కాలక్రమేణా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక రాత్రి సరిగ్గా నిద్ర లేకపోయినా.. మరుసటి రోజు మీరు అలసట, బలహీనత, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి రోజు రాత్రి 6-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. మరి మీరు ప్రతి రాత్రి తగినంత నిద్ర పోతున్నారా ? లేదా అనేది గమనించండి.
కు మంచిగా నిద్ర రాకపోయినా.. రాత్రిపూట తరచుగా నిద్రకు భంగం కలిగినా లేదా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గాఢనిద్ర రాకపోయనా మీరు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్ర లేకపోవడం మెదడును ఎందుకు ప్రభావితం చేస్తుంది:
నిద్ర ఎందుకు ముఖ్యమైనది. అసలు నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం ఎందుకు పడుతుందనే విషయాలను అర్థం చేసుకోవడానికి నిపుణుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. తగినంత నిద్ర లేకపోతే భవిష్యత్తులో అల్జీమర్స్ లేదా డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనంలో రుజువైంది.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని పరిశోధకులు 65 అంతకంటే ఎక్కువ వయస్సు గల 2,800 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి తర్వాత డిమెన్షియా వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రతి రాత్రి ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే అటువంటి వారిలో అకాల మరణ ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తుందట.
మెదడు సమస్యలు:
నిద్ర లేకపోవడం వల్ల అల్జీమర్స్-డిమెన్షియా ముప్పు
నిద్ర వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరగడమే కాకుండా శరీరాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మెదడు పనితీరుపై ప్రభావం:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యొక్క నివేదిక ప్రకారం సరిగ్గా నిద్రపోని వ్యక్తులు ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని పెంచుతారు. ఒక అధ్యయనం ప్రకారం 24 గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల మెదడు పనితీరు మత్తు మాదిరిగానే ఉంటుంది. కాలక్రమేణా మీ అభిజ్ఞా సామర్థ్యాలు కూడా క్షీణించడం ప్రారంభిస్తాయి.
Also Read: వంటగదిలో ఉండే.. ఈ 5 పదార్థాలు హైబీపీని తగ్గిస్తాయ్
గుండె జబ్బుల ప్రమాదం:
తగినంత నిద్ర లేకపోతే అధిక రక్తపోటు, క్రమరహిత హృదయ స్పందన అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలతో ముడిపడి ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రకారం రాత్రికి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు గుండె జబ్బుల ముప్పు 20% ఎక్కువగా ఉంటారు.
ఇదే కాకుండా నిద్ర లేకపోవడం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణమని భావించే ఆకలిని నియంత్రించే హార్మోన్లను, అసమతుల్యత చేయడం ద్వారా ఊబకాయాన్ని పెంచుతుంది.