White Onion Vs Red Onion: రోజూ వంటకాల తయారీలో సాధారణంగా ఉపయోగించే ఉల్లిపాయలు భోజనం రుచిని పెంచుతాయి. రెండు రంగుల్లో ఉల్లిపాయలను మనం ఎక్కువగా చూస్తుంటాం.
కానీ తెలుపు, ఎరుపు ఉల్లిపాయలు రంగులో మాత్రమే కాకుండా వాటి లక్షణాలు, పోషకాలలో కూడా విభిన్నంగా ఉంటాయని మీకు తెలుసా ? అవును వాటి ప్రయోజనాలు శరీరంపై వివిధ మార్గాల్లో ప్రభావం చూపుతాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్రటి ఉల్లిపాయలు ఎక్కువ ఘాటుగా, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్నప్పటికీ.. తెల్ల ఉల్లిపాయలు తక్కువ ఘాటుతో, ఎక్కువ రుచిని కలిగి ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. రెండింటిలోనూ విటమిన్లు సి, బి6 , ఫైబర్ ఉంటాయి. కానీ వాటి ఉపయోగాలు, ఆరోగ్య ప్రభావాలు భిన్నంగా ఉంటాయి.
.
తెలుపు, ఎరుపు ఉల్లిపాయల మధ్య తేడా:
రుచి , ఉపయోగాలలో తేడాలు: ఎర్ర ఉల్లిపాయలు పదునైన, ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని సలాడ్లు, చట్నీలు లేదా పచ్చిగా ఇష్టపడతారు. మరోవైపు.. తెల్ల ఉల్లిపాయలు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి, ఇవి శాండ్‌విచ్‌లు, పాస్తా లేదా ఇతర కొన్ని రకాల వంటకాలకు అనువైనవి. తెల్ల ఉల్లిపాయలు వేసవిలో చల్లదనాన్ని అందిస్తాయి.
పోషక వ్యత్యాసాలు:
ఎర్ర ఉల్లిపాయలలో ఆంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వాటిలో మంచి మొత్తంలో ఐరన్, ఫైబర్ కూడా ఉంటాయి. మరోవైపు.. తెల్ల ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా గ్యాస్, ఆమ్లతను తగ్గిస్తాయి.
ఆరోగ్య ప్రభావాలు:
ఎర్ర ఉల్లిపాయలు తినడం గుండె, రక్తపోటుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మరోవైపు.. తెల్ల ఉల్లిపాయలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, కిడ్నీ, కాలేయాన్ని పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఎవరికైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే.. ఎర్ర ఉల్లిపాయలకు బదులుగా తెల్లటి ఉల్లిపాయలు తినడం మంచిది.
Also Read: ఉదయం లేదా సాయంత్రం.. ఎప్పుడు నడిస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయ్ ?
సీజన్ ప్రకారం ఉల్లిపాయలను ఎంచుకోవడం: వేసవిలో తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇవి వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తాయి. చలికాలంలో ఎర్ర ఉల్లిపాయలు తినడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. అంతే కాకుండా ఇవి జలుబును నివారిస్తాయి. అంటే సీజన్ ప్రకారం ఉల్లిపాయలను ఎంచుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చర్మం, జుట్టుకు ప్రయోజనాలు:
ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది తలకు పోషణ నిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు చర్మాన్ని లోపలి నుంచి నిర్విషీకరణ చేస్తాయి. ముడతలను తగ్గించడంలో సహాయ పడతాయి. సహజంగా చర్మం, జుట్టు మెరుస్తూ ఉండాలంటే ఉల్లిపాయ జ్యూస్ ఉపయోగించడం మంచిది.
Also Read: పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం.. వీటితో అద్భుతమైన రిజల్ట్