BigTV English

TDP – YCP: అమిత్ షా వార్నింగ్? టెన్షన్‌లో ఉన్న ఆ ఇద్దరెవరు?

TDP – YCP: అమిత్ షా వార్నింగ్? టెన్షన్‌లో ఉన్న ఆ ఇద్దరెవరు?

TDP – YCP: ఏపీలో అమిత్ షా పర్యటన సాగింది.. ముగిసింది. కానీ ఆ పర్యటన తాలూకు నీడలు మాత్రం కాక రేపుతున్నాయి. ఒకే నెలలో పీఎం మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సాగింది. దీని వెనుక పెద్ద కథే ఉందని వైసీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. పీఎం పర్యటన ఏమో కానీ, అమిత్ షా పర్యటన గురించి మాత్రం పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.


ఏపీ పర్యటన నిమిత్తం అమిత్ షా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంధర్భంగా ముందుగా సీఎం చంద్రబాబు ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఇద్దరు కూడ ఉన్నారు. వీరితో అమిత్ షా చర్చలు గోప్యంగా సాగినా, బయట మాత్రం ప్రచారం వాడివేడిగా జరిగిందంటూ సాగుతోంది. లోకేష్ పై ఫిర్యాదులు వచ్చాయని, పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం ఉండాల్సిందేనని అమిత్ షా తెగేసి చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం సాగిస్తున్నది కూడ ఎవరో కాదు సాక్షాత్తు వైసీపీ నేతలే.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదే విషయంపై మాట్లాడారు. అసలు జరిగిన విషయాన్ని వదిలి, టీడీపీ ఏవేవో ప్రచారం సాగిస్తుందన్నారు. అంతేకాదు లోకేష్ ను కంట్రోల్ చేయండని అమిత్ షా చెప్పినట్లు తనకు తెలిసిందంటూ అంబటి చెప్పడం విశేషం. అయితే ఇదే విషయంపై టీడీపీ మరో ప్రచారం సాగిస్తోంది. మాజీ సీఎం జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగినట్లు, ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారని అడిగారని సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం జరుగుతోంది.‌


Also Read: Janasena on TDP: గవర్నర్‌‌‌‌‌‌గా చంద్రబాబు.. సీఎంగా పవన్.. డిప్యూటీ సీఎంగా లోకేష్?

అమిత్ షా మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తే, వైసీపీ మాత్రం భిన్నరీతిలో ప్రచారం సాగించడంపై టీడీపీ వాటిని తిప్పికొట్టేందుకు శ్రమిస్తోందని చెప్పవచ్చు. అక్కడ భేటీ రహస్యంగా సాగితే ఈ ప్రచారాలు మాత్రం పెద్ద తలనొప్పులు తెస్తున్నాయట టీడీపీకి. అలాగే తిరుమల వరుస ఘటనల గురించి కూడ, అమిత్ షా ఆరా తీయడం అందరికీ తెల్సిన విషయమే. ఏదిఏమైనా అమిత్ షా పర్యటన అనంతరం లోకేష్ గురించి ఆగ్రహం అంటూ వైసీపీ, జగన్ గురించి ఆరా తీశారని టీడీపీ ప్రచారం సాగిస్తుండగా, అసలు విషయం మాత్రం అక్కడ భేటీలో పాల్గొన్న వారికే ఎరుక. దీనితో నారా లోకేష్, జగన్ ఇద్దరూ అమిత్ షా టూర్ టెన్షన్ లో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×