BigTV English

Coffee Benefits: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

Coffee Benefits: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

Coffee Health Benefits: చాలా మంది పొద్దున్నే కప్పు కాఫీ తాగనితే రోజు గడవదు. కాఫీతో మానసిక ఉల్లాసంతో పాటు శరీరం యాక్టివ్ గా ఉంటుంది. రోజు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చైనాలోని సూచౌ యూనివర్శిటీ నిపుణులు నిర్వహించిన తాజా స్టడీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కాఫీ తాగని వారితో పోల్చితే తాగే వారు ఏకంగా 7 రకాల ప్రాణాంత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. గుండె పోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ సహా పలు రకాల జబ్బుల దరిచేరవని తేలింది.


గుండె జబ్బులు మాయం

రోజూ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులతో పాటు హార్ట్ స్ట్రోక్ ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధన తేల్చింది. రోజుకు ఒకటి లేదంటే రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండెపోటు తగ్గే అవకాశం ఉంది. కాఫీ తాగేవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 21 శాతం తక్కువగా ఉందని హంగేరీలోని సెమ్మెల్వీస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 17 శాతం తక్కువగా ఉందని వెల్లడించారు.


టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్

రోజు వారీ కాఫీలోని కెఫీన్ టైప్ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. కాఫీ గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని పెంచి డయాబెటిస్ ను అదుపు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎక్కువ కాఫీ తీసుకునే వ్యక్తులలో టైప్ 2 డయాబెటిస్‌ సోకే అవకాశం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

కాలేయ ఆరోగ్యం

కాఫీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తేలింది. కాఫీలోని కెఫిన్ కాలేయ ఎంజైమ్ స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది. కాఫీ తాగే వారికి లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ ఉందని పరిశోధకులు తెలిపారు.

క్యాన్సర్లు మాయం

రోజూ కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గొంతు, పేగు, గర్భాశయ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్లను కాఫీ అదుపు చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. రోజూ మూడు కప్పుల కాఫీ తాగే వారిలో క్యాన్సర్ ముప్పు 18 శాతం తక్కువగా ఉందని గుర్తించారు.

అల్జీమర్స్ కంట్రోల్   

కాఫీ తాగడం వల్ల న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారు. కెఫీన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ ముప్పును తగ్గిస్తున్నట్లు గుర్తించారు. కెఫీన్ మెదడును యాక్టివ్ గా ఉంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మానసిక ఆరోగ్యం

కాఫీ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పొద్దున్నే కప్పు కాఫీ తాగితే రోజంతా యాక్టివ్ గా ఉంటారని తేలింది. కాఫీ తాగేవారికి డిప్రెషన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు తగ్గిపోతాయని వెల్లడించాయి. రోజుకు నాలుగు అంతకంటే ఎక్కువ కప్పులు కాఫీ తాగేవారిలో ఆత్మహత్య చేసుకునే ఆలోచన 53 శాతం తక్కువగా ఉంటుందని  పరిశోధకులు తెలిపారు.

కాఫీతో దీర్ఘాయుష్షు   

కాఫీ ఎక్కువ కాలం జీవించడంలో సాయపడుతుంది. కాఫీ తాగేవారు తాగని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలో వెల్లడయ్యింది. రోజూ కాఫీ తాగడం వల్ల సుమారు 12 ఏండ్లకు పైగా జీవిత కాలం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

Read Also: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×