BigTV English

Weight Loss Tips : బరువు ఈ టైమ్‌లో అసలు చెక్ చేసుకోవద్దు..!

Weight Loss Tips : బరువు ఈ టైమ్‌లో అసలు చెక్ చేసుకోవద్దు..!
weight loss
Weight loss Tips

Weight Loss Tips : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమస్య అధిక బరువు. ఈ సమస్య కారణంగా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా బరువు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ వర్క్అవుట్స్, మీరు ఫాలో అవుతున్న డైట్, తీసుకుంటున్న ఆహారం.. మీ బరువును తగ్గిస్తున్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తరచూ బరువును చెక్ చేసుకోవాలి.


అయితే మీరు తరచూ వెయిట్ స్కేల్‌పై బరువు చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీ శరీర బరువు రోజంతా ఒకలా ఉండదు.. మారుతూ ఉంటుంది. అనేక ఇతర కారణాలు కూడా స్కెల్‌లో మీ బరువును ప్రభావితం చేయొచ్చు. స్కెల్ ప్రకారం మీరు బరువు తగ్గకపోతే, బరువు చెక్ చేస్తున్న సమయం కూడా తప్పు కావచ్చు. అసలు బరువును ఎప్పుడు చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Read More : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!


మీరు రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే బరువు చెక్ చేసుకోకపోవడం మంచిది. నిద్రలేమి కారణంగా కూడా శరీరంలో నీరు నిలిచి శరీంలోని వ్యర్థాలు బయటకు వెళ్లవు. దీనివల్ల బరువు తగ్గడం కాదు కదా.. 100 గ్రాములు అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా నిద్రలేమి శరీర బరువును పెంచుతుంది. శరీరగానికి తగినంత నిద్ర పొందకపోతే.. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది

మీరు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కూడా బరువును చెక్ చేసుకోకపోవడం మంచిది. ఫ్లైట్ జర్నిలో ఎక్కువ సేపు కూర్చోనే ఉంటారు. ఎక్కువగా నడవరు. దీనివల్ల శరీరంలోని దిగువ అవయవాల్లో నీరు పేరుకుపోతుంది. ఈ సమయంలో రక్తప్రసరణ జరగదు. ఫలితంగా బరువులో కొంత మార్పులు వస్తాయి.

Read More : మీరు టీవీ చూస్తూ తింటున్నారా..?

ఆల్కహాల్, ప్రాసెస్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు బరువు పెరుగుతారు. ఆల్కహాల్‌ను శరీరం నుంచి తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇలాంటి సమయంలో బరువు చెక్ చేసుకోకండి.

మీరు ఆలస్యంగా ఆహారం తిన్నా బరువు చెక్ చేసుకోవడం మంచిది కాదు. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలానే ఆలస్యంగా భోజనం చేసి నిద్రపోవడం వల్ల కడుపు ఉబ్బరం, బద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

Disclaimer : ఈ కథనాన్ని ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×