BigTV English

Drinking Water : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!

Drinking Water : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!
drinking water
Drinking Water

Never Drinking Water : మనలో చాలా మంది భోజనానికి ముందు లేదా తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. కొందరికైతే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇలా తాగటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నీటిని తాగకపోవడమే మంచిది. మీరు కచ్చితంగా దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. తెలిసీ తెలియకుండా ఇటువంటి తప్పులు చేయకండి. ఇప్పుడు చెప్పుకునే ఆహారాలు ఆరోగ్యకరమైనప్పటికీ తిన్న తర్వాత నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అన్నం తింటూ నీళ్లు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి మంచి అలవాటు కాదు. ఆహారాన్ని తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. బియ్యంతో కూడిన ఏ ఆహారం తిన్నా ఇది పాటించాలి.

Read More : వేసవి వచ్చేసింది.. మీ ఆహారంలో ఈ మార్పులు చేయండి..!


మసాలా లేదా మసాలా ఫుడ్ తినే సమయంలో నీళ్లు తాగకూడదు. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది. మసాలా తిన్న తర్వాత నీరు తాగితే కడుపులో మంటగా అనిపిస్తుంది.

అరటిపండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే అజీర్ణ సమస్యలు వస్తాయి. అలానే జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. దీని కారణంగా కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అరటిపండు తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే మానుకోండి.

పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అయితే పెరుగన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిన్ కంటెంట్‌ను శరీరం గ్రహించదు. ఇది హృధా అవుతుంది. ఆహారం తినేప్పుడు పెరుగు తినండి కానీ, నీళ్లు మాత్రం తాగకండి.

పెరుగన్నం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇవ్వండం వల్ల పెరుగులో ఉండే ప్రీబయోటిన్ మీ శరీరంలోకి చేరుతుంది. ప్రీబయోటిన్ మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Read More : త్వరగా తింటే ఏమోతుందో తెలుసా..?

ద్రాక్ష, నారింజ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న వెంటనే నీరు తాగాల్సిన అవసరం లేదు. ఈ పండ్లను తాగి నీళ్లు తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిని తిన్న తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలి. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. ద్రాక్ష, నారింజ పండ్ల నుంచి పోషకాలు మీ శరీరానికి చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది.

Disclaimer : ఈ కథనం పలు వైద్య అధ్యాయనాలు, నిపుణుల సలహా మేరకు రూపొందించిన సమాచారం మాత్రమే.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×