BigTV English

Thyroid : థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..!

Thyroid : థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..!
Thyroid Problems

Thyroid Problems (health news today):


థైరాయిడ్ సమస్య అనేది ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీన్ని హైపో థైరాయిడిజం అని కూడా అంటారు. థైరాయిడ్ గ్రంథి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ థైరాయిడ్ గ్రంథి సరైన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్‌ను విడుదల చేయకపోవడం వల్లనే ఈ వ్యాధి వస్తుంది.

అయితే ఇందులో రెండు రకాల థైరాయిడ్స్ ఉన్నాయి. థైరాయిడ్ గ్రంథి నుంచి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ విడుదలైనట్లయితే హైపర్ థైరాయిడిజం, తక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ విడుదలైనట్లయితే హైపో థైరాయిడిజం అని అంటారు. థైరాయిడ్ హార్మోన్ అనేది సంతాన సమస్యలకు ముఖ్య కారణం అవుతుంది.


Read More : పొడవాటి గోళ్లు అంటే ఇష్టమా.. షాకింగ్ నిజాలు..!

థైరాయిడ్ సమస్య కారణంగా.. సంతానలేమి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక జీవక్రియలు కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్ సరైన మొత్తంలో శరీరంలో విడుదల కాకపోతే పలు వ్యాధులకు దారి తీస్తుంది.

హైపర్, హైపో థైరాయిడ్ వ్యాధుల వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అండాశయంలో జరిగే పరిణామాలకు థైరాయిడ్ హార్మోన్ కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

హైపోథైరాయిడిజం కారణంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. దీనివల్ల శరీరానికి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ విడుదల కాదు. ఇలా జరగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగడంతో సంతానలేమి సమస్యలు మహిళల్లో తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

Read More :  రెండు తమలపాకులు నమిలితే..!

పురుషుల్లో కూడా హైపోథైరాయిడిజం కారణంగా సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైపోథైరాయిడిజం కారణంగా శుక్ర కణాలు చలనం ఉండదు. అలానే స్పార్మ్ క్వాలిటీ, క్వాంటిటీపై ప్రభావం చూపుతోంది.

హైపోథైరాయిడిజం కారణంగా లైంగికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంగస్తంభనలు సరీగా లేకపోవడం, శుక్రకణాల్లో కదలిక లేకపోవడం కారణంగా అండాశయంలో అండాన్ని చేరుకోవడంలో శుక్రణాలు విఫలమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సంతాన లేమి సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైపోథైరాయిడిజం మహిళల్లో కూడా రుతుక్రమాన్ని దెబ్బతీస్తోంది. దీనివల్ల అండం సరైన సమయంలో విడుదల కాదు. తద్వారా సంతాన ఉత్పత్తికి అవసరమైన ప్రక్రియ నెమ్మదిస్తుంది.

హైపర్,హైపో రకాల థైరాయిడ్ సమస్యలు కారణంగా సంతానలేమి సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం విషయంలో బరువు పెద్ద ఎత్తున కోల్పోవడం జరగుతుంది. గుండె సమస్యలు రావడం వంటి లక్షణాలు కూడి కనిపిస్తాయి. మహిళల్లో హైపర్ థైరాయిడిజం కారణంగా పీరియడ్స్ సరైన సమయంలో రావని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : పలు పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా ఈ సమాచారం సేకరించబడింది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×