BigTV English

IND vs ENG 3rd Test Day 2 LIVE Updates: ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం.. ఒత్తిడిలో టీమ్ ఇండియా..?

IND vs ENG 3rd Test Day 2 LIVE Updates: ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం.. ఒత్తిడిలో టీమ్ ఇండియా..?
india vs eng 3rd test updates

India Vs England 3rd Test Day 2 Live Updates: రాజ్ కోట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటతో చెలరేగిపోయింది. ఆ ఆట ఎప్పుడు ఆడతారా? అని అందరూ ఎదురుచూస్తుంటే మూడో టెస్ట్ లో టీమ్ ఇండియాకు రుచి చూపించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఆటోమేటిక్ గా టీమ్ ఇండియాని ఒత్తిడిలోకి నెట్టేసింది.


ఈ సిరీస్‌లో పిచ్‌లన్నీ తొలి మూడు రోజులు బ్యాటింగ్‌కు సహకరించాయి. తర్వాత నుంచి స్పిన్ కు టర్న్ అవుతున్నాయి. అందువల్ల రాజ్ కోట్ పిచ్ పరిస్థితి అలాగే ఉందని వెటరన్ బౌలర్ అశ్విన్ అన్నాడు. ఐదో రోజు పిచ్ కఠినంగా మారే అవకాశం ఉందని అన్నాడు.

చివరి రోజు వరకు మ్యాచ్ ని తీసుకెళ్లి ఇంగ్లాండ్ కి బ్యాటింగ్ ఇవ్వగలిగితే వికెట్లు వాటంతటవే పడతాయని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. మూడోరోజు కూడా బ్యాటింగ్ కి అనుకూలించడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగి పోవచ్చునని అంటున్నారు.


Read More: రాజ్ కోట్ టెస్టు.. అశ్విన్ రికార్డుల మోత..

అందుకని టీమ్ ఇండియా ప్రశాంతంగా ఆడాలని చెబుతున్నారు. ఎందుకంటే రెండోరోజు అంపైర్ టీమ్ ఇండియాకి ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వడమే అందుకు కారణమని చెబుతున్నారు.

ఈ విషయంలో అశ్విన్ మళ్లీ అంపైర్ తో గొడవేసుకున్నాడు. విషయం ఏమిటంటే అశ్విన్ మిడిల్ పిచ్ మీద పరిగెడుతున్నాడని అంపైర్ జోయోల్ విల్సన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు ఇమ్మీడియట్ గా 5 పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించాడు.

నిజానికి ఇలా పరిగెడితే మొదట వార్నింగ్ ఇస్తారు. తర్వాతే పెనాల్టీ విధిస్తారు. అదే విషయాన్ని అశ్విన్ అడిగినట్టుగా తెలిసింది. అయితే అంతకుముందే ఆ వార్నింగ్ రవీంద్ర జడేజా అందుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే అశ్విన్ అలా మిడిల్ పిచ్ మీదకు వెళ్లగానే, ఇలా అంపైర్ పెనాల్టీ విధించాడని భావిస్తున్నారు.

అందుకనే ఇలాంటి తొండాటలు పాకిస్తాన్ తో ఆడండి గానీ.. జంటిల్మన్ గేమ్ ఆడే ఇంగ్లాండ్ తో వద్దని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. వారు టీమ్ ఇండియాలో ఎవరు చక్కగా ఆడినా అభినందిస్తున్నారు. ఇది మంచిపరిణామం, దీనిని కొనసాగించమని చెబుతున్నారు.

Tags

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×