Supreme Court: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నారు. అలాగే రేబిస్ తో ప్రజలు చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వీధి కుక్కులను గురించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషుల ప్రాణాల కన్నా.. జంతువుల సంక్షేమం అంత ముఖ్యమేమీ కాదని వివరించింది. సుప్రీం జారీ చేసిన ఆదేశాలను ఎనిమిది వారాల్లో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో రోజు రోజుకీ వీధి కుక్కల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కుక్కల సమస్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీం నగరంలో చుట్టు పక్కల ఉన్న అన్నీ వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాని కోర్టు స్పష్టం చేససింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల ఆందోళనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. రేబిస్ తో చనిపోయిన వారిని ఎవరు తీసుకొస్తారని ఘాటుగా ప్రశ్నించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకుంటారని మండిపడింది.
వీధి కుక్కల బెడద అనేది కేవలం ఒక ఇబ్బందికరమైన సమస్య మాత్రమే కాదని.. అది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటించే ప్రధానమైన ప్రజా భద్రతా సమస్యగా అని సుప్రీం కోర్టు పేర్కొంది. వీధి కుక్కలు వాటిని పెంచుకునే ప్రజల హక్కుల సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొన్ని నెలల నుంచి వీధికుక్కల సమస్య పెరిగింది. రాత్రి సమయంలో ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్లే వారిని.. అలాగే ఉదయం వేళ వాకింగ్ కు వెళ్లేవారిని వీధి కుక్కులు వెంటాడి కరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
ముఖ్యంగా ప్రజలకు రేబిస్ వ్యాధి సోకి చనిపోతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు ప్రజలందరికీ ఊరట కలిగించే అంశంగా వివరించింది. ఈ ఆదేశాలన్నింటిని అమలు చేసేందుకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ), ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ALSO READ: Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!
అయితే.. వీధి కుక్కలను షెల్టర్లను తరలించడం అంతే ఈజీ మాత్రం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. లక్షల సంఖ్యలో ఉణన్న వీధి కుక్కలను గుర్తించి పట్టుకోవడం సవాలుతో కూడిన పని అని పేర్కొంది. వాటిని ఉంచడానికి సరిపడా షెల్టర్లు, సిబ్బంది, వనరులు చాలా అవసరమని అంటున్నారు. అంతేకాకుండా జంతు సంక్షేమ సంస్థల నుంచి వ్యతిరేకత కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీధి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది చెబుతున్నారు. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు వీధి కుక్కల సమస్యపై ఒక కొత్త చర్చకు దారితీయనుంది. ప్రభుత్వంపై, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ఒత్తిడిని పెంచాయని చెప్పవచ్చు.