BigTV English
Advertisement

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Monkey video viral: ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడేం జరిగినా క్షణాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక హాస్యాస్పదమైన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కోతికి పగడి ధరించడం మనం చూడొచ్చు. ఇది నెటిజన్లను నవ్వులో ముంచెత్తింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక కోతికి నీలం రంగు పగడిని జాగ్రత్తగా ధరించడం కనిపిస్తుంది. ఆ కోతి అక్కడ శాంతంగా కూర్చుని, పగడి ధరించిన తర్వాత ఒక మోడల్‌ల కనిపిస్తూ, అందరినీ ఆకర్షించింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మస్త్ వైరల్ గా మారింది.


ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి వైఖరిని అలాగే దాని అందమైన రూపాన్ని చూసి ఆకర్షితులవుతున్నారు. కొందరు దీనిని “వానర్‌సింగ్” అని, మరికొందరు “సర్దార్ మంకేష్ సింగ్” అని హాస్యంగా పేర్లు పెడుతూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన ఒక వ్యక్తి ‘నేను సోషల్ మీడియాలో చూసిన అత్యంత అందమైన, హాస్యాస్పదమైన వీడియో ఇది.. ఇది ఈ రోజున నన్ను సంతోషపరిచింది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు ‘కోతి పగడిని ధరించిన తీరు చూస్తే, అది ఏదో అద్భుతమైనది ధరించినట్లు భావించినట్లు అనిపిస్తుంది’ అని రాసుకొచ్చారు.

ALSO READ: Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్


ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి పట్ల కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘ఈ వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు. కోతి అతనితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రవర్తించింది. అంటే అది సురక్షితంగా భావించింది’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో కోతి  ప్రశాంతమైన వైఖరి, దాని చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల సానుకూల స్పందన దీనిని మరింత ప్రత్యేకమైనదిగా చేసిందని కామెంట్ చేస్తున్నారు.

ALSO READ: Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

ఈ సంఘటన మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా అలంకరణలతో అందంగా కనిపిస్తాయనే ఆలోచనను ప్రూఫ్ చేసింది. అయితే, ఈ వీడియో గురించి కచ్చితమైన వివరాలు తెలియదు. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వినోదాన్ని అందించడమే కాకుండా, జంతువుల పట్ల మానవుల సానుభూతిని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో  మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది.

Related News

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Big Stories

×