Producer Skn: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో ఎస్ కే ఎన్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా యాక్టివ్ గా ఉంటాడు ఎస్కేఎన్. చాలా సందర్భాలలో మెగా హీరోల పైన తనకు ఉన్న ప్రేమను కూడా చెబుతూ ఉంటాడు.
ముఖ్యంగా అల్లు అరవింద్ కు ఎస్ కే ఎన్ కు మంచి బాండింగ్ ఉంది. ఇక రీసెంట్గా బేబీ అనే సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా కార్మికులకు మరియు నిర్మాతలకు ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా కార్మికులు తమ వేతనాన్ని 30% పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తెలుగు సినిమా నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇతరుణంలో చిన్న సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్స్ కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఎస్ కే ఎన్ సంచలన నిర్ణయం
ఈ ఈవెంట్లో ఎస్ కే ఎన్ మాట్లాడుతూ ముందుగా మా నిర్మాతల దగ్గర డబ్బులు లేక మేము యాంకర్ ని పెట్టుకోలేదు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చిన్న సినిమాలను నిర్మించే నిర్మాతలే. మేము సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వలన టికెట్ రేట్లు పెంచుతున్నారు అంటూ మా మీద పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు 100 కోట్ల సినిమాలు చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిర్మాతలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలిపారు. అయితే తాను ఒక మాలను ధరించానని, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మాలను తొలగిస్తాను అని సంచలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎస్ కే ఎన్.
హిందీలో బేబీ
ఎస్ కే ఎన్ కు దర్శకుడు మారుతికు మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే రాజా సాబ్ సినిమా విషయంలో అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. అలానే సాయి రాజేష్ తో ఫ్రెండ్షిప్ ఉంది. అందుకోసమే ఉన్న ప్రాపర్టీ కూడా అమ్మి బేబీ సినిమాను నిర్మించాడు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అని అనిపించుకుంది. ఒక ప్రస్తుతం అదే సినిమాని హిందీలో నిర్మిస్తున్నాడు ఎస్ కే ఎన్. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా కొన్ని నిజ జీవితంలో సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటాడు. పిఠాపురంలో ఒక ఫ్యామిలీకి ఆటోను కొన్ని ఇచ్చాడు ఎస్ కే ఎన్. ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా రెస్పాండ్ అయ్యే అతి తక్కువ మంది ప్రొడ్యూసర్స్ లో ఎస్కేఎన్ కూడా ఒకరు.
Also Read : Coolie: 14 న సినిమా రిలీజ్ అయితే 15న ఈవెంట్, ఎవరా క్రియేటివ్ జీనియస్.?