BigTV English

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Dates For Hair: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. మారిన జీవన శైలితో పాటు అనారోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి కొంత మంది హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. వీటి కోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు.


మార్కెట్‌లో దొరికే షాంపూలు, ఆయిల్స్‌లో చాలా రసాయనాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా హాని కలిగిస్తాయి. అందుకే ఇంట్లోనే సహజంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం గురించి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఈ ప్రత్యేక చర్యలను ప్రయత్నించండి:


1.జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోండి.

2. ఖర్జూర అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

3. జుట్టు రాలడం తగ్గాలంటే ఖర్జూరను ఆహారంలో చేర్చుకోవాలి.

4. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

5. ఖర్జూరంలో విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా విటమిన్ బి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

6. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. చాలా మంది మహిళల శరీరంలో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దాని స్థాయిని మెరుగుపరచడం అవసరం.

7. ఖర్జూరం కూడా ఫైబర్ యొక్క మంచి మూలం. 100 గ్రాముల ఖర్జూరంలో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ,బలహీనతను తొలగించడానికి మంచిదని భావిస్తారు.

8.ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి.

Also Read: తెల్లజుట్టు నల్లగా మారిపోవాలా ? ఇంట్లోనే ఈ హెయిర్ డై తయారు చేసుకోండి

ఖర్జూరాలు తినడానికి సరైన మార్గం:

1.మీకు జుట్టు రాలడం తగ్గాలంటే, రోజుకు 1 నుండి 2 ఖర్జూరాలు తినండి.

2.నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

3.మీరు ఖర్జూరాన్ని పాలలో వేసి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగవచ్చు.

4. నానబెట్టిన ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తినడం కూడా మేలు చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×