Big Stories

Curry Leaves Benefits: ఆకులే కదా అని లైట్ తీస్కోకు బ్రో.. వీటితో ఎన్ని లాభాలో తెలుసా..?

Health Benefits of Curry Leaves: కరివేపాకు లేనిదే పప్పు, సాంబార్, చట్నీలు టేస్ట్ ఉండవు. కరివేపాకు వాసన, రుచి తగిలితే ఒక్కసారిగా వాటి రుచి మొత్తం మారిపోతుంది. అంతే కరివేపాకుకు అంత ప్రత్యేకత ఉంది. కరివేపాకులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులోని ఔషధగుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆయుర్వేదంగా పరిగణిస్తారు నిపుణులు. అయితే కరివేపాకు కేవలం వంటల్లోకి మాత్రమే కాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

జీర్ణక్రియ..

- Advertisement -

కరివేపాకును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కరివేపాకులో ఉండే లాక్సిటివ్ లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచేందుకు తోడ్పడతాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యల బారిన పడకుండా ఉండేలా చేస్తుంది.

మెంటల్ హెల్త్..

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు కరివేపాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, పనిభారం, డబ్బు, అనారోగ్య సమస్యలు వంటి మానసిక ఆరోగ్యం బారిన పడకుండా చేస్తుంది. కరివేపాకు నీటిని తాగితే ఎటువంటి టెన్షన్ అయినా సరే క్షణంలో పరార్ అయివాల్సిందే అని నిపుణులు అంటున్నారు.

Also Read: Millets: చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలం..ఈ రోగాలకు చెక్ !

బరువు తగ్గడం..

కరివేపాకును రసం చేసుకుని తాగడం వల్ల శరీర బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్యలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అందువల్ల అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికి కరివేపాకు రసం ఓ ఔషధంలా పనిచేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News