Big Stories

Millets: చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలం..ఈ రోగాలకు చెక్ !

Health Benefits Of Millets: పూర్వం చిరుధాన్యాలనే ప్రజలు ఎక్కువగా తినేవారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అప్పటి మనుషులు వందేళ్లు బతికారు. ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఇలా అనేక రకాల చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకునేవారు. కాల క్రమేనా పెరుగుతున్న జనాభా అవసరాల కారణంగా తిండి గింజల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి.

- Advertisement -

పూర్వకాలంలో బియ్యం, గోధుమలు తక్కువగా తినేవారు. చిరుధాన్యాలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే అప్పటి మనుషులు వందేళ్లు బతికారు. కానీ నేటి రోజుల్లో మనిషి 60 ఏళ్లు బతకడం కష్టంగా మారింది. దీనికి కారణం మారుతున్న జీవన విధానం, ఆహార పద్ధతుల్లో మార్పు అని చెప్పొచ్చు. హరిత విప్లవం వల్ల గోధుమ, వరి సాగు విపరీతంగా పెరిగింది. వాటి ఉపయోగం కూడా చాలా వరకూ పెరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు ఉదయం చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం తినడం అవసరం.

- Advertisement -

సామలు: సామలను ఆహారంగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణంతో పాటు పలు సమస్యలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చాలా మంది ప్రస్థుతం మైగ్రేన్ సమస్యతో బాధపగుతున్నారు. ముఖ్యంగా మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి సామలతో తయారు చేసిన ఆహారం ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు సామలతో తయారు చేసిన ఆహారం ఉపయోగపడుతుంది.

Also Read: ఆలస్యంగా నిద్ర పోతున్నారా..రిస్క్ లో పడ్డట్టే

కొర్రలు : ఇవి రెండు రకాల రుచిని కలిగి ఉంటాయి. ఇవి తీపి, వగరు రుచులను కలిగి ఉండటం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. కొర్రలు షుగర్ వ్యాధితో బాధ పడేవారికి ఎంతో మేలు చేస్తాయి. అధిక పీచు, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్స్ కొర్రల్లో పుష్కలంగా ఉంటాయి. కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు ఔషధంగా ఇవి పని చేస్తాయి.

ఊదలు: ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చుని పని చేస్తూ ఉంటారు. కొర్రలు తినడం వల్ల ఉద్యోగులకు చాలా మేలు కలుగుతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి. శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారం అని చెప్పొచ్చు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, మధు మేహంతో బాధపడే వారికి మంచి ఆహారం.

అరికెలు: ఖనిజ లవణాలు, విటమిన్లు అరికెల్లో అధికంగా ఉంటాయి. కాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరికెలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News