BigTV English
Advertisement

Nutmeg Powder: ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

Nutmeg Powder: ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

Nutmeg Powder: ప్రతీ వంటింట్లో మసాలా దినుసులు తప్పక ఉంటాయి. అందులో ప్రత్యేకమైనది జాజికాయ. జాజికాయతో ఎలాంటి వంటకానికి అయినా అద్భుతమైన రుచి వస్తుంది. ముఖ్యంగా మాంసాహారాల్లో మసాలా దినులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో ఉపయోగించే జాజికాయతో మంచి రుచి వస్తుంది .జాజికాయలో యాంటీ ధర్మబోటిక్, బయోటిక్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో కాపర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, కాపర్ వంటివి ఉండడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి. అంతేకాదు వీటి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే జాజికాయను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.


జాజికాయతో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ క్రమంలో జాజికాయను కేవలం వంటల్లో మాత్రమే కాకుండా జాజికాయ పొడితో తయారుచేసిన నీటిని తాగితే ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పంటి సమస్యలు, నోటి దుర్వాసనతో బాధపడేవారు జాజికాయ పొడిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు ఉన్నా కూడా జాజికాయ పొడితో తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో నీటిని తరచూ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

మరోవైపు నిద్రలేమి వంటి సమస్యతో బాధపడేవారు కూడా జాజికాయను తీసుకోవచ్చు. దీనివల్ల అధిక ఒత్తిడి, మెదడు సమస్యలు, వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ ఉదయం లేదా రాత్రి వేళ తీసుకున్నా కూడా నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది. అంతేకాదు నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు.


జాజికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండె సంబంధింత సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపు చేసుకోవచ్చు. ఇక చర్మంపై మంట, దురద వంటి వాటి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. జాజికాయతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖంపై ఏర్పడే యాక్నే వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేదంటే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Banana Hair Mask: అరటి పండుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే సిల్కీ హెయిర్

Gold Cleaning Tips: బంగారు ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా ఇంట్లోనే సింపుల్‌గా తళతళలాడించేయండి

Big Stories

×