BigTV English

Actress Sai Pallavi: సాయిపల్లవి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?

Actress Sai Pallavi: సాయిపల్లవి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?
Advertisement

Do you know the first movie in which Sai Pallavi acted?: నేచురల్ యాక్టింగ్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే బ్యూటీ సాయి పల్లవి. నేచురల్ లుక్స్‌​తో ఆకట్టుకునే ఈ నటి, తన యాక్టింగ్‌తోనే కాకుండా డ్యాన్స్‌​తోనూ ఆడియెన్స్‌ నుండి మంచి మార్కులు కొట్టేసింది. అందుకే లాంగ్వేజీతో లింక్‌ లేకుండా ఈమెకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడిప్పుడే నార్త్‌​లోనూ తన సత్తా చాటాలని ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది.అయితే అందరూ ఆమె మలయాళం ప్రేమమ్ మూవీ ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని అనుకుంటున్నారు.


కానీ నిజానికి దానికంటే ముందే ఆమె సినిమాల్లో యాక్ట్ చేసిందన్న విషయం మనందరికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. చాలామంది నేను ప్రేమమ్‌ మూవీతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాననుకుంటున్నారు. కానీ అంతకంటే ముందే నేను రెండు సినిమాల్లో నటించాను. కస్తూరీ మాన్‌ ధామ్‌ధూమ్‌ అనే రెండు తమిళ సినిమాల్లో చిన్న రోల్స్‌ చేశానంటూ తెలిపింది. ఇది విన్న నెటిజన్లు ఖంగుతిన్నారు. కొందరైతే ఆ సినిమాలను మళ్లీ చూసి అందులోని సాయిపల్లవి క్లిప్పింగ్స్‌ను నెట్టింట పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా సాయిపల్లవిని ఇందులో అస్సలు కంపేర్ చేయలేకపోతున్నామంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదే ఇంటర్య్వూలో తన ఫస్ట్ టాలీవుడ్ మూవీ గురించి కొన్ని విషయాలను పంచుకుంది.

Also Read: సినిమా కోసం నా సర్టిఫికెట్స్ కాల్చేసిన డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు


తెలుగులో నేను చేసిన ఫిదా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ తెలిపింది. తొలిసారి ఆ మూవీ పోస్టర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని తెలిపింది. షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అనుకుందట ఈ మూవీ ఆడియో లాంఛ్‌​లో తెలుగు స్పీచ్ ఇవ్వాలని. అనుకున్నట్లుగా తాను చేశానంది. అంతేకాదు ఆ సినిమా తనకి ప్రతిష్టాత్మక ఫిలింఫేర్‌ అవార్డునూ కూడా తెచ్చిపెట్టిందని తెలిపింది. ఆ మూవీతో నా జీవితం మలుపు తిరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇక సాయి పల్లవి అప్‌కమింగ్ మూవీస్ మ్యాటర్‌కి వస్తే.. టాలీవుడ్‌లో నాగచైతన్యతో జోడీగా తండేల్ మూవీలో యాక్ట్ చేస్తోంది. హిందీలో రెండు సినిమాలు బాలీవుడ్ హీరో ఆమీర్‌ఖాన్​ తనయుడి సరసన సందడి చేయనుంది. దీంతో పాటు రణ​బీర్ కపూర్‌​తో రామాయణ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయంటూ ఎమోషనల్ అయింది సాయిపల్లవి.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×