HMPV Symptoms : చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య బారిగా పెరుగుతోంది. కోవిడ్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ ముఖ్యంగా 14 ఏళ్ల లోపు వారిలో, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వ్యాపిస్తోంది. అసలు hmpv వైరస్ అంటే ఏమిటి ? ఈ వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ? నివారణ మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచం కోవిడ్-19 నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరొక ప్రమాదకరమైన వైరస్ ప్రజల ఆందోళనలను పెంచింది. చైనాలో మరోసారి కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ HMPV ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ వైరస్ కోవిడ్-19 వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV అంటే ఏమిటి ?
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV 2001 సంవత్సరంలో కనుగొనబడింది. ఈ వైరస్ కోసిన వారిలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. కానీ ఈ వైరస్ చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి సరిగా లేని వారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
HMPV యొక్క లక్షణాలు:
1. U.S. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV శీతాకాలపు ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటుంది.
HMPV వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ మొదలైన సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి.
2. ఈ వైరస్ సోకిన 3-6 రోజుల తర్వాత దాని ప్రభావాలు కనిపిస్తాయి.
Also Read: 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే.. జరిగేదిదే !
నివారణ మార్గాలు:
1. HMPV వైరస్‌ను నివారించడానికి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి.
2. చేతులు కడుక్కోకుండా నోరు, ముక్కును తాకడం మానుకోండి.
3. మీ దగ్గర ఎవరైనా తుమ్ముతుంటే, మీ నోటిని కప్పుకోండి.
4. సోకిన వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.
5. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.
6. సోకిన వ్యక్తుల పాత్రల నుండి తినడం మానుకోండి.